మీరు కొత్తగా వాహనం కొనుగోలు చేసి, దానికి నచ్చిన ఫ్యాన్సీ నంబర్ (ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్) కేటాయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. మీరు వాహనం కొని తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) పొందిన రెండు నెలల లోపు ప్రత్యేక నంబర్‌ను రిజర్వ్ చేసుకోని వాహనదారులకు రవాణా శాఖ షాక్ స్పష్టం చేసింది. ఒకవేళ మీరు టీఆర్ నెంబర్ అలాగే ఉంచి.. తిరుగుతుంటే.. రెండు నెలల్లో అలాంటి వారికి ఇకపై సిస్టమ్ ఆటోమేటిక్‌గా సాధారణ నంబర్‌ను కేటాయిస్తుందని రవాణా శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ప్రస్తుతం అమలులో ఉన్న ‘వాహన్’ (VAHAN) విధానం ప్రకారం.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి జారీ చేసే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) కేవలం 30 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే సవరించిన తాజా విధానం ప్రకారం.. వాహన యజమానులకు టీఆర్ జారీ చేసిన తేదీ నుండి రెండు నెలల (60 రోజులు) సమయం లభిస్తుంది. ఈ లోపు వారు తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా ఎలాంటి నంబర్ కేటాయించుకోకపోతే, వాహన్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఒక సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్‌ను జనరేట్ చేసి కేటాయిస్తుంది.
వాహనం కొనుగోలు చేసే సమయంలో ఫ్యాన్సీ నంబర్ పట్ల ఆసక్తి చూపి, ఇప్పటివరకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే స్పందించాలని అధికారులు సూచించారు. గడువు ముగిస్తే మాత్రం కంప్యూటరైజ్డ్ పద్ధతిలో రాండమ్‌గా సాధారణ నంబర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు.
రవాణా శాఖ అధికారిక ‘వాహన్’ పోర్టల్‌ను సందర్శించి మీ పరిధిలోని సిరీస్‌లో అందుబాటులో ఉన్న ఫ్యాన్సీ నంబర్ల జాబితాను పరిశీలించండి. మీకు నచ్చిన నంబర్ కోసం నిర్ణీత రుసుము చెల్లించి ఆన్‌లైన్ వేలం (E-Auction) ప్రక్రియలో పాల్గొనండి.
టీఆర్ తీసుకున్న 60 రోజుల లోపే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా చూసుకోండి. లేదంటే సాధారణ నంబర్‌తోనే సర్దుకుపోవాల్సి వస్తుంది.
{{/usCountry}}టీఆర్ తీసుకున్న 60 రోజుల లోపే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా చూసుకోండి. లేదంటే సాధారణ నంబర్‌తోనే సర్దుకుపోవాల్సి వస్తుంది.
{{/usCountry}}రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అలాగే ఆర్టీఏ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి కాలయాపన చేయకుండా వెంటనే మీ లక్కీ నంబర్‌ను లాక్ చేసుకోండి!
కొనుగోలు సమయంలో ఫ్యాన్సీ నంబరు పొందడానికి ఆసక్తి చూపినప్పటికీ, ఇంకా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయని వారు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని రవాణా శాఖ సూచించింది. రెండు నెలల గడువు ముగిసిన తర్వాత ఎలాంటి రిజర్వేషన్ జరగకపోతే 'వాహన్' వ్యవస్థ ఆటోమేటిక్‌గా ఒక సాధారణ నంబరును రూపొందించి కేటాయిస్తుందని అధికారులు తెలిపారు.