తెలంగాణలో డిసెంబర్ 2025లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం అమ్మకాలు రూ.5,102 కోట్లకు చేరుకున్నాయి. గతంలో డిసెంబర్ 2023లో మద్యం అమ్మకాలు రూ.4,300 కోట్లు దాటాయి. ఇప్పుడు డిసెంబర్ 30న మాత్రమే మొత్తం మద్యం అమ్మకాలు రూ. 375 కోట్లకు చేరుకున్నాయి. ఇది 2025 సంవత్సరంలో ఒకే రోజు జరిగిన అత్యధిక అమ్మకం.

2025 చివరి రోజు డిసెంబర్ 31న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల ద్వారా సాయంత్రం సమయానికే దాదాపు రూ. 350 కోట్లకుపైగా సంపాదించింది. డిసెంబర్ చివరి రెండు రోజుల మెుత్తం కలిపితే రూ.750 కోట్ల వరకు అమ్మకాలు ఉన్నాయి. 2023, 2024 డిసెంబర్‌తో పోలీస్తే.. ఈసారి 13 వందల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు వేసింది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉండేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతి ఇచ్చింది. అమ్మకాలు మరింత భారీగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు పలు రకాల బ్రాండ్ మద్యం ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచాయని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చు. వేగంగా మారుతున్న వినియోగదారుల అభిరుచులు, యువతలో పెరుగుతున్న మద్యం వినియోగం రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల నుండి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
బోనాలు, దసరా, నూతన సంవత్సర పండుగల సమయంలో రాష్ట్రంలో మద్యం వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు కూడా డిసెంబర్ నెలలో భారీగా అమ్మకాలు జరిగాయి.
{{/usCountry}}బోనాలు, దసరా, నూతన సంవత్సర పండుగల సమయంలో రాష్ట్రంలో మద్యం వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు కూడా డిసెంబర్ నెలలో భారీగా అమ్మకాలు జరిగాయి.
{{/usCountry}}లైసెన్స్ పొందిన అన్ని మద్యం దుకాణాలు ఎంఆర్పీని కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా NDPL (నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్) అమ్ముతున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో NDPL మద్యం అమ్మకాలు, ఎంఆర్పీ ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి ఆ శాఖ బృందాలు మద్యం దుకాణాలను ఆకస్మికంగా సందర్శించి మద్యం నిల్వలను తనిఖీ చేశాయి.