భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు తెగబడిన ముఠాల గుట్టు రట్టు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వేగం పెంచింది. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో దేశ భద్రతకు అత్యంత కీలకమైన డిజిటల్ నెట్‌వర్క్‌పై దాడులకు యత్నించిన కేసులో ఎన్ఐఏ అధికారులు సోమవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ సోదాలు మొత్తం ఐదు కీలక ప్రాంతాల్లో సాగాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంతో పాటు మహారాష్ట్రలోని పుణే (జున్నార్), గుజరాత్‌లోని ఖేడా (నాడియాడ్), బీహార్‌లోని గోపాల్‌గంజ్, దేశ రాజధాని ఢిల్లీలలో ఎన్ఐఏ బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి.
ఆపరేషన్ సింధూర్ ఏంటి…?
గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు ఘాతకానికి ఒడిగట్టారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు మూకలు 25 మంది పర్యాటకులను, ఒక స్థానిక గుర్రపు స్వారీ నిర్వాహకుడిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు.
ఈ దారుణ ఉగ్రదాడికి నిరసనగా, భారత సాయుధ దళాలు గత ఏడాది మే 7న తీవ్రస్థాయిలో తిప్పికొట్టాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా నిశిత దాడులు నిర్వహించాయి. ఈ సైనిక చర్యకే 'ఆపరేషన్ సింధూర్' అని నామకరణం చేశారు.
ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే, మన దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీసేందుకు కొందరు ఉగ్ర సానుభూతిపరులు కుట్ర పన్నారు. దేశంలోని 54 ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్‌లు, సంక్లిష్టమైన కంప్యూటర్ వనరులు, క్లిష్టమైన సమాచార మౌలిక సదుపాయాలను స్తంభింపజేయడానికి 'డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్' విధానంలో భారీ సైబర్ దాడులకు ప్రయత్నించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఎన్ఐఏ వెల్లడించింది.
గత ఏడాది జూన్ 25న నమోదు చేసిన ఈ కేసును మొదట గుజరాత్ పోలీసులు విచారించారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
డిజిటల్ సాక్ష్యాల స్వాధీనం
{{/usCountry}}గత ఏడాది జూన్ 25న నమోదు చేసిన ఈ కేసును మొదట గుజరాత్ పోలీసులు విచారించారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
డిజిటల్ సాక్ష్యాల స్వాధీనం
{{/usCountry}}సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన ఎన్‌ఐఏ…. అరెస్టయిన నిందితులకు దాడుల నైపుణ్యాలు నేర్పించడంలో, వారికి కావాల్సిన సాంకేతిక సహకారం అందించడంలో కొందరు వ్యక్తులు సహాయపడినట్లు గుర్తించింది. న్యాయస్థానం అనుమతితో సోమవారం ఉదయం సదరు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసింది.
ఈ సోదాల్లో హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అనేక డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి ల్యాప్‌టాప్‌లు, ఐదు మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లతో పాటు ఇతర సాంకేతిక పరికరాలను సీజ్ చేశారు. విచారణలో భాగంగా ఈ అనుమానితులను ఇప్పటికే జైలులో ఉన్న ప్రధాన నిందితులతో ఉన్న సంబంధాలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు.
ఇక తెలంగాణకు చెందిన రామగుండంలోని స్థానిక అయోధ్యనగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు… ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే స్థానిక ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉగ్రవాద సంస్థలతో, ముఖ్యంగా అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో ఇతడికి ఉన్న సంబంధాలపై ఎన్‌ఐఏ బృందాలు తీవ్రంగా ఆరా తీస్తున్నాయి. సైబర్ దాడులకు పాల్పడిన ముఠాకు సదరు యువకుడు ఎలాంటి సాంకేతిక సహకారం అందించాడు? కోడింగ్, హ్యాకింగ్ నైపుణ్యాలను ఎలా సమకూర్చాడు? అనే అంశాలపై అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అరెస్టయిన నిందితులతో ఉన్న పరిచయాలు, అతడు నిర్వహించిన డిజిటల్ లావాదేవీలను కూడా దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా అతడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.