NGRI హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పర్సనల్ ఉద్యోగాలు - ఈ తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
CSIR NGRI Hyderabad Recruitment 2026 : హైదరాబాద్‌లోని CSIR-NGRI ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17, 19, 21 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
CSIR NGRI Hyderabad Recruitment 2026 : హైదరాబాద్ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) పలు ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. విద్యా అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు లేదా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు.

పోస్టుల వివరాలు…
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి…
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 01 పోస్టు (కోడ్ A)
- ప్రాజెక్ట్ అసోసియేట్-I: 04 పోస్టులు (కోడ్‌లు B, C, D)
- ప్రాజెక్ట్ అసోసియేట్-II: 03 పోస్టులు (కోడ్‌లు E, F)
- ప్రాజెక్ట్ అసోసియేట్-I/II: 01 పోస్టు (కోడ్ D).
అర్హతలు…
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II పోస్టుకు కంప్యూటర్ సైన్స్‌లో బి.ఎస్సీ (B.Sc) మరియు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ పరిజ్ఞానం ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్-I (ఫైనాన్స్) ఉద్యోగానికి ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ (MBA) లేదా తత్సమాన అర్హతతో పాటు ఫైనాన్స్, అకౌంట్స్ నిర్వహణలో అనుభవం ఉండాలి.
ప్రాజెక్ట్ అసోసియేట్-I & II (టెక్నికల్) పోస్టుకు జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, జియాలజీ, హైడ్రోలాజికల్, లేదా రిమోట్ సెన్సింగ్ విభాగాల్లో ఎం.ఎస్సీ/ఎం.టెక్/ఎం.ఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్-II పోస్టులకు 2 ఏళ్ల సంబంధిత పని అనుభవం తప్పనిసరి.
వాక్-ఇన్ ఇంటర్వ్యూలను హైదరాబాద్ ఉప్పల్ రోడ్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ ఆవరణలో నిర్వహిస్తారు.
- ఆగస్టు 17, 2026: ప్రాజెక్ట్ అసిస్టెంట్-II (కోడ్ A), ప్రాజెక్ట్ అసోసియేట్-I (కోడ్ B) ఆగస్టు 19, 2026: ప్రాజెక్ట్ అసోసియేట్-I (కోడ్ C)
- ఆగస్టు 21, 2026: ప్రాజెక్ట్ అసోసియేట్-I/II (కోడ్‌లు D, E, F)
- ఇంటర్వ్యూ రోజున ఉదయం 8:30 గంటల నుంచి 10:00 గంటలలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు భర్తీ చేసిన దరఖాస్తు ఫారమ్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ స్వయం ధృవీకరణ నకళ్లు, సీవీ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరుకావాలి.
- నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకాలేని అభ్యర్థులు ఆగస్టు 13, 2026 లోపు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తును పూర్తి చేసి, తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడం ద్వారా ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
- మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.ngri.res.in/ లో చూడవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చూడొచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

