TMREIS Admissions 2026 : మైనార్టీ గురుకులాల్లో 5, 6, 7, 8వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

TMREIS Admissions 2026 :మైనారిటీ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతి ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మార్చి 31వ తేదీతో గడువు పూర్తవుతుంది.

Published on: Mar 23, 2026, 05:57:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా….. మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.

మైనారిటీ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతి ప్రవేశాలు
మైనారిటీ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతి ప్రవేశాలు

ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 5, 6, 7, 8 తరగతులల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మార్చి 31వతేదీతో ముగుస్తుంది.

రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల్లో 75శాతం సీట్లు మైనార్టీలకు, 25శాతం సీట్లు మైనార్టీయేతర విద్యార్థులకు రిజర్వు చేశారు. అభ్యర్థులు https://tgmreistelangana.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మైనార్టీ విద్యార్థులకు తొలుత దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. మైనార్టీయేతర విద్యార్థులకు లక్కీడిప్‌ ద్వారా సీట్లు కేటాయిస్తారు.

తరగతిని అనుసరించి 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కుటుంబ వార్షికా ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలుగా ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 040-23437909 ( ఉదయం10:30 నుంచి సాయంత్రం 5:00 గంటలు) ను సంప్రదించవచ్చు.

ఆన్ లైన్ దరఖాస్తులు - మీ వద్ద ఉండాల్సిన వివరాలు:

  • అభ్యర్థి పేరుతో పాటు తల్లి, తండ్రి పేరు
  • మొబైల్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • ఆధార్ నెంబర్
  • ఆదాయ ధ్రువపత్రం
  • కుల ధ్రువీకరణపత్రం
  • రెసిడెన్షియల్ అడ్రస్
  • దివ్యాంగ విద్యార్థులు అయితే సంబంధిత పత్రాలు
  • ఇతర వివరాలు

ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More