మాదాపూర్‌లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకుంది . రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీని వెనుక సూత్రధారి స్వామి నాయుడు, అతని కుటుంబం పరారీలో ఉన్నారు.

NSN ఇన్ఫోటెక్ కంపెనీ గత కొన్ని నెలలుగా మాదాపూర్‌లోని ఒక భవనంలోని కార్యాలయం పెట్టుకుని పనిచేస్తోంది. ఇది 'ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ' వంటి అధిక డిమాండ్ ఉన్న కోర్సులలో శిక్షణ అందించింది. శిక్షణ తర్వాత తన కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి నిరుద్యోగి దగ్గర నుండి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రుసుము వసూలు చేసింది . ఈ విధంగా మొత్తం 400 మంది విద్యార్థుల నుండి దాదాపు రూ. 10-12 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే ఎప్పటిలాగే ఈ ఉదయం తరగతులకు వచ్చిన నిరుద్యోగులు షాక్ అయ్యారు. కంపెనీ బోర్డు తిప్పేసింది. శిక్షణ ఇవ్వకుండా తలుపులు మూసి ఉంచారు. యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. వాట్సాప్ గ్రూపులు డిలీట్ చేశారు. స్వామి నాయుడు, అతని భార్య, కంపెనీకి చెందిన మరికొందరు ముఖ్య వ్యక్తులు కనిపించడం లేదు. నిరుద్యోగులు ఆఫీసుకు చేరుకుని తలుపు తట్టినప్పుడు ఎవరూ స్పందించలేదు.
'మాకు కూడా అద్దె చెల్లించలేదు, ఎవరో వచ్చి లాక్ చేశారు.' అని ఇంటి యజమాని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఆ కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు, శిక్షణ పూర్తయిన తర్వాత వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తామని ఉద్యోగార్థులకు చెప్పాడు. అతని మాట నమ్మిన అభ్యర్థులు డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత నాయుడు ఆ డబ్బుతో పరారీ అయ్యాడు. బాధితులు సైబరాబాద్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
{{/usCountry}}ఆ కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు, శిక్షణ పూర్తయిన తర్వాత వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తామని ఉద్యోగార్థులకు చెప్పాడు. అతని మాట నమ్మిన అభ్యర్థులు డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత నాయుడు ఆ డబ్బుతో పరారీ అయ్యాడు. బాధితులు సైబరాబాద్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
{{/usCountry}}