సెప్టెంబర్ 14 నుండి 24 వరకు టీజీఎస్ఆర్టీసీ వినాయక చవితి స్పెషల్ బస్సులు.. ఈ రూట్‌లలో..

TGSRTC Vinayaka Chavithi Special Buses : వినాయక చవితి పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 14 నుండి 24 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టుగా వెల్లడించింది.

Published on: Sep 13, 2026, 15:20:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వినాయక చవితి ఉత్సవాల సందడి మెుదలైంది. దీంతో ఖైరతాబాద్, బాలాపూర్ గణపతి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రకటించింది. ఈ ప్రత్యేక సేవలు సెప్టెంబర్ 14 నుండి 24 వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి తెలిపారు.

ఆర్టీసీ వినాయక చవితి స్పెషల్ బస్సులు
ఆర్టీసీ వినాయక చవితి స్పెషల్ బస్సులు

ఈ బస్సులు నగరంలోని ప్రధాన బస్సు స్టేషన్లైన జూబ్లీ బస్సు స్టేషన్ (JBS), మహాత్మా గాంధీ బస్సు స్టేషన్ (MGBS) మీదుగా నడుస్తాయి. జేబీఎస్ నుండి బయలుదేరే బస్సులు ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డికాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్, ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ప్రెస్, ఐఎస్ సదన్, ఫిసల్‌బండ, బాలాపూర్ క్రాస్ రోడ్స్ మీదుగా బాలాపూర్ గణేష్ మండపం వైపు చేరుకుంటాయి.

జేబీఎస్ నుండి మొదటి ప్రత్యేక బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 9:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధిలో సేవలు కొనసాగుతాయి. బాలాపూర్ నుండి తిరుగు ప్రయాణ సేవలు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 11:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

నగరంలో గణేష్ ఉత్సవాల సమయంలో భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించేలా ఆర్టీసీ ముందస్తు ఏర్పాట్లు చేసినట్టుగా ప్రకటించింది. పండుగ సమయంలో పెరగనున్న ప్రయాణికుల రద్దీని తట్టుకోవడం, రెండు ప్రధాన గణేష్ మండపాలకు రవాణా సౌకర్యం కల్పించడం ఈ ప్రత్యేక సేవల ముఖ్య ఉద్దేశం.

మరోవైపు పండుగ సీజన్‌లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన తర్వాత బస్సులు తిరిగి వచ్చేటప్పుడు చాలా వరకు ఖాళీగా వస్తుంటాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివరించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, డీజిల్, నిర్వహణ కోసం అయ్యే అదనపు ఖర్చును భరించేందుకు సాధారణ ఛార్జీపై గరిష్టంగా 50 శాతం వరకు అదనపు ఛార్జీని వసూలు చేయనుంది. 'GO MS No 16 of 2003' రవాణా సంస్థలకు ప్రత్యేక సందర్భాల్లో అదనపు ఛార్జీలు అనుమతినిస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More