ప్రయాణికులకు అలర్ట్... హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఢిల్లీకి వన్ వే స్పెషల్ ట్రైన్స్
దసరా, దీపావళి పండుగల వేళ హైదరాబాద్, చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు దక్షిణ మధ్య రైల్వే వన్‌వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులకు సూచించింది.
పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వన్‌వే పండుగ ప్రత్యేక రైళ్లను నడపనుంది. దసరా, దీపావళి వేళ సొంతూర్లు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్…
హైదరాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్ (రైలు నంబరు: 07031) : ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 9 శుక్రవారం నాడు రాత్రి 23:25 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. రెండు రోజుల ప్రయాణం తర్వాత (రెండో రోజు) ఉదయం 11:55 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. ఈ రైలును ఒక్క ట్రిప్ (01 సర్వీస్) మాత్రమే నడపనున్నారు.
- ఈ రైలు మార్గమధ్యంలో సికింద్రాబాద్, కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సి, జబల్‌పూర్, కట్ని, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బందా, VGL ఝాన్సీ, గ్వాలియర్ ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతుంది.
చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్ (రైలు నంబర్ - 07035) : చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 11 ఆదివారం నాడు రాత్రి 23:55 గంటలకు బయలుదేరుతుంది. ఇది కూడా ప్రయాణించిన రెండో రోజు ఉదయం 11:55 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సర్వీసును కూడా ఒక ట్రిప్ కే పరిమితం చేశారు.
- ఈ రైలు కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సి, జబల్‌పూర్, కట్ని, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బందా, VGL ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లలోనూ ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. సాధారణ రైళ్లలో బెర్త్‌లు దొరకక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఈ వన్‌వే పండుగ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

