...
...
Next Story

వర్షాకాలంలో స్కూల్ విద్యార్థులకు వారానికి ఒకరోజు ఆన్‌లైన్ క్లాసులు!

వర్షాలు పడుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వారానికి ఒకరోజు ఆన్‌లైన్ క్లాసులు విషయం తెరపైకి వచ్చింది.

Published on: Jun 21, 2026, 18:16:21 IST
Advertisement

వర్షాకాలంలో స్కూళ్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీస్ శాఖ ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు నగరంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ పనులను వేగవంతం చేసేందుకు వారానికి ఒకరోజు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేలా విద్యాసంస్థలను కోరాలని పోలీసులు భావిస్తున్నారు.

వర్షాకాలంలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు
వర్షాకాలంలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ త్వరలోనే పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో వారానికి ఒకరోజు (ముఖ్యంగా బుధ లేదా గురువారాల్లో) ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆయన కోరనున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే, రెండు నెలల్లో విద్యార్థులు 8 రోజులు ఇంటి నుంచే క్లాసులకు హాజరవుతారు. 'దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా, సైబరాబాద్ మున్సిపల్ అధికారులు పౌర పనులను సజావుగా పూర్తి చేయడానికి వీలవుతుంది.' అని సీపీ తెలిపారు.

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూల్ జోన్లలో ట్రాఫిక్ రద్దీ మళ్లీ మొదలైంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పేరెంట్స్ వాహనాలు, స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఒకేసారి క్యాంపస్‌ల ముందుకు వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. చాలా స్కూళ్లలో విద్యార్థులను దించడానికి, ఎక్కించుకోవడానికి సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

సైబరాబాద్ పరిధిలో 250 కి పైగా పాఠశాలలను అత్యధిక ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలుగా గుర్తించారు. జీడిమెట్లలో అత్యధిక ట్రాఫిక్ ఒత్తిడి ఉన్న క్లస్టర్‌గా నిలిచింది. ఇక్కడ 116 స్కూళ్లు, 73,041 మంది విద్యార్థులు ఉన్నారు. బాలానగర్ 67 స్కూళ్లు, 46,523 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 30 స్కూళ్లకు సొంత రవాణా సదుపాయం లేదు. కూకట్‌పల్లిలో 40 స్కూళ్లు, 37,728 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 32,000 మందికి పైగా ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఇలా అనేక స్కూళ్లు ఉన్నాయి.

మరోవైపు మల్కాజ్‌గిరి వైపు చూస్తే.. హబ్సిగూడ-నాచారం కారిడార్, ఉప్పల్ ప్రాంతాల్లో స్కూల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. వాహనాలను నిలపడానికి ప్రత్యేక స్థలాలు లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు చేరవేసేందుకు సొంత వాహనాల వాడకం విపరీతంగా పెరగడం వల్ల, సాధారణ రోడ్లపై ఒక్కసారిగా వేలాది వాహనాలు వచ్చి చేరుతూ ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks