ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ (PhD) అభ్యసించాలనుకుంటున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఓయూ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.
నవంబర్ 14 నుంచి పరీక్షలు….

మొత్తం 53 సబ్జెక్టులకు గాను ఈ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈసారి ప్రవేశ పరీక్షలను పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలోనే నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజూ మూడు వేర్వేరు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో ( https://www.osmania.ac.in/ ) అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి తమ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాలకవర్గం తెలిపింది.
పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షా కేంద్రాలను కేవలం హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
"పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయానికి కనీసం 90 నిమిషాల (గంటన్నర) ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకుని రిపోర్టింగ్ చేయాలి," అని ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి సూచించారు. బయోమెట్రిక్ నమోదు, ఇతర తనిఖీల ప్రక్రియ సులువుగా పూర్తయ్యేందుకే ఈ సమయాన్ని నిర్దేశించినట్లు అధికారులు వెల్లడించారు.
కేటగిరి - 2 కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎంట్రెన్స్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభ చూపిన వారితో పాటు పాటు సెట్, నెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫైనల్ గా సీట్లు పొందిన వారి వివరాలను డిపార్ట్ మెంట్ల వారీగా విడుదల చేస్తారు.
{{/usCountry}}కేటగిరి - 2 కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎంట్రెన్స్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభ చూపిన వారితో పాటు పాటు సెట్, నెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫైనల్ గా సీట్లు పొందిన వారి వివరాలను డిపార్ట్ మెంట్ల వారీగా విడుదల చేస్తారు.
{{/usCountry}}