...
...
Next Story

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - రూ.745 కోట్లు విడుదల

ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published on: Feb 27, 2026, 15:13:36 IST
Advertisement

ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత కొద్దిరోజులుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో…. పెండింగ్‌ బకాయిల కింద రూ.745 కోట్లను విడుదల చేశారు.

విడతల వారీగా నిధులు….

పెండింగ్ బకాయిలు విడుదల
పెండింగ్ బకాయిలు విడుదల

విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలోనే రాష్ట ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా బకాయిలు విడుదలయ్యాయి. గత సంవత్సరం జూన్ నుంచి ప్రతి నెలా కనీసం రూ. 700 కోట్లను ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే సర్కార్ చేపట్టి… ముందుకెళ్తోంది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బిల్లులలో ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని… నిధులను విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల కోసం సర్కార్… ఇటీవలనే రెండు కొత్త పథకాలను కూడా ప్రకటించింది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ప్రమాద బీమా పథకం వర్తింపజేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ ఈ పథకాన్ని విస్తరించింది. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్లు బీమా పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం అందించనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks