ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : KCRకు మరోసారి సిట్‌ నోటీసులు - ఆదివారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు.

Published on: Jan 30, 2026, 23:32:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ లోని ఇంటి చిరునామాలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నంది నగర్‌ నివాసంలో ఇంటి గోడకు సిట్ నోటీసులు అతికించారు.

కేసీఆర్
కేసీఆర్

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ స్పష్టం చేసింది. సీఆర్పీసీ 160 కింది నోటీసులు అందజేసింది. మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ అవ్వటం కీలక పరిణామంగా మారింది.

నిజానికి కేసీఆర్ విచారణకు సంబంధించి ఇటీవలనే సీట్ నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 30వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు హాజరు కాలేను అని కేసీఆర్ బదులిచ్చారు. విచారణను రీషెడ్యూల్ చేయాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నందున సమయం ఇవ్వాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని… విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు.

ఎర్రవల్లిలోనే విచారించాలని కేసీఆర్ కోరినప్పటికీ… తాజాగా జారీ అయిన ఆదేశాల్లో మాత్రం నందినగర్ నివాసంలోనే విచారిస్తామని సిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

మరో వైపు సిట్‌ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్‌, హారీశ్‌రావు.. కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సిట్‌ నోటీసులపై ఏం చేయాలన్న విషయమై న్యాయవాదుల సలహా మేరకు కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More