ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు. ఏడు గంటలకు పైగా ఆయనను అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సంతోష్‌ను కేసుకు సంబంధించిన అనేక అంశాలపై దర్యాప్తు అధికారులు పరిశీలించారు. దాదాపు రాత్రి 11 గంటల వరకు విచారణ కొనసాగింది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే సంతోష్ రావు సిట్ ముందు హాజరుకావడం రాజకీయ చర్చకు దారితీసింది. నివేదికల ప్రకారం, కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు.. బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) సీనియర్ అధికారుల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారా? అని సంతోష్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది.
మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో ఆయన సంభాషణలపై, వారి కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ, ఉద్దేశాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత కోరినట్లు చెబుతున్నారు. ప్రభాకర్ రావు పదవీ విరమణ తర్వాత తీసుకున్న పరిపాలనా నిర్ణయాల గురించి, గత ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పొడిగింపు గురించి సంతోష్‌ను సిట్ ప్రశ్నించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలపై నిఘా ఆరోపణలపై కూడా దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఈ ఆపరేషన్ గురించి సంతోష్‌కు ఎంతవరకు తెలుసో.. తెలుసుకోవడానికి సిట్ ప్రయత్నించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకంపై నిర్ణయం ఎవరిదని సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సంతోష్ రావు ముందు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టి అడిగినట్టుగా సమాచారం.
అంతేకాకుండా దర్యాప్తు అధికారులు సంతోష్ రావును ఎన్నికల బాండ్ల గురించి, ముఖ్యంగా వ్యాపార సంస్థల నుండి బలవంతపు పద్ధతుల ద్వారా నిధులు సేకరించబడ్డాయా అని ప్రశ్నించారని తెలుస్తోంది. గతంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కూడా ఇలాంటి ప్రశ్నలు వేసినట్లుగా ప్రచారం జరిగింది.
{{/usCountry}}అంతేకాకుండా దర్యాప్తు అధికారులు సంతోష్ రావును ఎన్నికల బాండ్ల గురించి, ముఖ్యంగా వ్యాపార సంస్థల నుండి బలవంతపు పద్ధతుల ద్వారా నిధులు సేకరించబడ్డాయా అని ప్రశ్నించారని తెలుస్తోంది. గతంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కూడా ఇలాంటి ప్రశ్నలు వేసినట్లుగా ప్రచారం జరిగింది.
{{/usCountry}}ముగ్గురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే ప్రశ్నించడంతో తెలంగాణలో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ కేసుపై దర్యాప్తు బృందం ముమ్మరంగా విచారణ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణ కోసం పిలిపించాలని సిట్ ఇప్పుడు పరిశీలిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంటుదోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.