ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం మల్కాజ్ గిరి కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రేక్షకులకు కీలక సూచనలు చేశారు.
ప్రేక్షకులకు కీలక సూచనలు:
- ఉప్పల్ స్టేడియంలోకి వచ్చే వారు ఫిజికల్ టికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలా అయితేనే లోపలికి అనుమతిస్తారు.
- పవర్ బ్యాంకులు, బ్యాగులు, హెల్మెట్లు, వాటర్ బాటిల్స్ మాత్రమే కాకుండా పెన్లు కూడా స్టేడియం లోపలికి అనుమతించరు.
- మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండగా.. గేట్లు మధ్యాహ్నం 12:30 నుంచే తెరుచుకుంటాయి. ఫాన్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని నిబంధనలు పాటిస్తూ స్టేడియంలోకి వెళ్లాలి.
- హెల్మెట్ పార్కింగ్ వద్దే పెట్టుకోవాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమిస్తే స్టేడియం ఎంట్రీ వద్దే ఆపివేస్తారు.
- మొబైల్ ఫోన్, కొంత క్యాష్ కూడా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే స్టేడియం పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ పేమెంట్స్‌పై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్తపడటం మంచిదని హెచ్చరిస్తున్నారు.
- గేట్ నెం. 1 ప్రత్యేకంగా ఆటగాళ్ల కోసం కేటాయించారు. టిక్కెట్ల కేటాయింపు ప్రకారం ప్రేక్షకులు నిర్దేశిత గేట్ల ద్వారానే ప్రవేశించాలి.
- బయటి ఆహారం వంటి వస్తువులను ప్రేక్షకులు తీసుకురావడం నిషిద్ధం. ప్రతి గేట్ వద్ద మొబైల్-తనిఖీ సాంకేతిక నిపుణులుంటారు.
- ఇవాళ మ్యాచ్ ఉండటంతో ఈ రూట్ లో ట్రక్కులు, లారీలు, ప్రైవేట్ బస్సులతో సహా భారీ వాహనాల కోసం దారి మళ్లింపులను ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
- ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న కీలక మార్గాలలో ఆంక్షలు అమలు అవుతాయి. ఏప్రిల్ 5న మధ్యాహ్నం 12.00 గంటల నుండి రాత్రి 23.50 గంటల మధ్య, ఉప్పల్ మీదుగా నాగోల్ నుండి హబ్సిగూడకు, బోడుప్పల్ నుండి అంబర్‌పేట్‌కు వెళ్లే మార్గాలలో రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
- మ్యాచ్‌కు వచ్చే అభిమానులు పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
- నిర్దేశిత ప్రదేశాలలో పార్కింగ్ చేయాలి. అయితే స్టేడియం పార్కింగ్‌లోకి పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. చెల్లుబాటు అయ్యే పాస్‌లు లేని వాహనాలను కీలక చెక్‌పాయింట్లు దాటి అనుమతించరు.

ట్రాఫిక్ ఆంక్షలు:
మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ ఉప్పల్ రూట్లలో ట్రాఫిక్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. నాగోల్ నుంచి హబ్సిగూడ వయా ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లే వారు…… బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వయా ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హెచ్‌ఎండిఏ ఉప్పల్ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద నుంచి మెహిఫిల్ హోటల్ మీదుగా నాగోల్, ఎల్‌బి నగర్ వైపు వెళ్లాలి.
తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్డు మీదుగా నాచారం, ఎన్ఎఫ్సి రోటరీ, ఐఓసిఎల్ చెర్లపల్లి, ఘట్ కేసర్ వైపు వెళ్లాలి. వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా అబ్దుల్లార్‌మెట్, హయత్ నగర్, ఎల్బీ నగర్ వైపు మళ్లిస్తారు.
{{/usCountry}}తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్డు మీదుగా నాచారం, ఎన్ఎఫ్సి రోటరీ, ఐఓసిఎల్ చెర్లపల్లి, ఘట్ కేసర్ వైపు వెళ్లాలి. వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా అబ్దుల్లార్‌మెట్, హయత్ నగర్, ఎల్బీ నగర్ వైపు మళ్లిస్తారు.
{{/usCountry}}