ఫోన్ ట్యాపింగ్ కేసు : ముగిసిన ప్రభాకర్ రావు విచారణ - నెక్స్ట్ ఏంటి..?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు విచారణ శుక్రవారంతో ముగిసింది. 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపిన సిట్.. ఆయన్నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Published on: Dec 26, 2025, 11:37:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు లొంగిపోయారు. 14 రోజుల కస్టోడియల్ విచారణ గడువు ముగియటంతో… ఇవాళ ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత… ఇంటికి పంపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసు

సిట్ దర్యాప్తు వేగవంతం - కీలక సమాచారం…!

ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఈ టీమ్ పని చేస్తోంది. ప్రభాకర్ రావును ఈ ప్రత్యేక బృందం పలుమార్లు విచారించింది. జూబ్లీహిల్స్‌ స్టేషన్‌లోని కార్యాలయంలో గంటల కొద్దీ విచారణ కొనసాగింది. సిట్‌ సభ్యులు అంబర్‌కిశోర్‌ ఝా, విజయ్‌కుమార్‌ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ జరిపారు. ఇదే కేసులోని మిగిలిన నిందితులు రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడత విచారించారు.

ప్రత్యక్ష సాక్ష్యుల కంటే కూడా డిజిటల్ రికార్డుల ఆధారంగానే విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. రాజకీయ నేతల పాత్రతో పాటు ఈ కేసులో కీలకంగా ఉన్న పెన్ డ్రైవ్ లోని వివరాల ఆధారంగా పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు బ్యాంక్ ఖాతాల గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం.

ఇక ఈ కేసులో నందకుమార్ ని కూడా సిట్ విచారించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ అరెస్ట్ కూడా అయ్యారు. అయితే తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ డీజీపీగా రవి గుప్తా ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో పాటు ఎమ్మెల్యే కొనుగోలు కేసులోని వివరాల ఆధారంగా నందకుమార్ నుంచి కూడా సిట్ కొంత సమాచారాన్ని తీసుకుంది. ఫామ్ హౌస్ కేసులో ఆడియోలు, వీడియోలు ఎలా బయటికొచ్చాయనే దానిపై సిట్ అధికారులు ఆరా తీశారని నందకుమార్ చెప్పారు.

ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన సిట్…. కాల్ డేటా రికార్డులు, వాంగ్మూలాలు, పెన్ డ్రైవ్ లోని డేటాను విశ్లేషిస్తూ ముందుకెళ్తోంది. నిందితుల ఆర్థిక వ్యాపార వ్యవహారాలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. దర్యాప్తు అత్యంత గోప్యంగా జరుగుతుండగా…. సిట్ సమర్పించే తుది నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రుల పేర్లు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో….. ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More