...
...
Next Story

వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్.. కొత్తగా ఏసీఈ గ్రూప్!

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 24, 2025, 15:45:19 IST
Advertisement

ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పలు సంస్కరణలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ , ప్రాక్టికల్స్, ఇంటర్నల్ మార్కులు వంటి కీలక అంశాల్లో మార్పులు జరగనున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని రోజుల కిందట ఈ అంశంపై చర్చ జరిగింది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. మార్పులపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపింది. వీటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-27 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.

ఇంటర్మీడియట్‌లో అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం రాత పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 శాతం మార్కులు ఇంటర్నల్ పరీక్షలకు ఇస్తారు. ఇప్పుడు ఆంగ్లానికి మాత్రమే ఈ పరీక్షలు ఉన్నాయి. ఇక మీదట సంస్కృతం, తెలుగు, గణితం ఇలా తదితర సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు కేటాయిస్తారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయన్నమాట.

ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ వారికి ప్రయోగ పరీక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మీదట ఫస్ట్ ఇయర్ వారికి కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కులనే రెండు సంవత్సరాలకు సమానంగా కేటాయింపు చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్‌ ఎంపీసీ గ్రూపులో ఫిజిక్స్, కెమిస్ట్రీ 15 మార్కులు, సెకండర్ ఇయర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బైపీసీ గ్రూపులో ఒక్కో సబ్జెక్టుకు 30 చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. వాటిని ఇక మీదట సగం చేస్తారు.

ఇప్పటి వరకు సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉన్నాయి. ఎంఈసీలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అకౌంటెన్సీ సబ్జెక్టుకు పెరుగుతున్న ఆదరణ కారణంగా కొత్త గ్రూపును తీసుకురానున్నారు. ఏసీఈ గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks