హైదరాబాద్ నగరంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ నగర ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతున్న గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల (డెలివరీ బాయ్స్) కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ భాగస్వాములు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రాథమిక వసతులు పొందడానికి వీలుగా నగరంలో ‘ప్రగతి కేంద్రాలను’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం,ఆన్‌లైన్ గ్రోసరీ డెలివరీ యాప్ జెప్టోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

రోజంతా రోడ్లపై తిరుగుతూ సేవలందించే డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లేమిని అధిగమించేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. 2024లో హైదరాబాద్‌లోని 166 మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులపై హీట్‌వాచ్ నిర్వహించిన సర్వే సంచలన విషయాలను వెల్లడించింది.
నగరంలో దాదాపు 69 శాతం మంది గిగ్ వర్కర్లకు పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యం అందుబాటులో లేదు. 80 శాతానికి పైగా కార్మికులకు తీవ్రమైన ఎండ, వర్షం నుంచి ఉపశమనం పొందేందుకు సరైన నీడ లేదా విశ్రాంతి స్థలాలు, కూలింగ్ సౌకర్యాలు లేవని తేలింది. ఈ గణాంకాలు గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న మానవీయ, ఆరోగ్య సమస్యల తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి.
ఈ కేంద్రాలు కేవలం ఒక నిర్దిష్ట కంపెనీకి చెందిన వారి కోసమే కాకుండా, ప్లాట్‌ఫామ్‌తో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ (స్విగ్గీ, జొమాటో వంటివి), ఈ-కామర్స్ (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్), దుస్తుల సరఫరా, ఇతర లాస్ట్-మైల్ డెలివరీ నెట్‌వర్క్‌లలో పనిచేసే కార్మికులందరూ ఉచితంగా వీటిని వినియోగించుకోవచ్చు. అందుబాటులో ఉండే సదుపాయాలు చూసుకుంటే.. మంచినీరు, విశ్రాంతి తీసుకోవడానికి కూలింగ్ ఏరియా, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు వంటి అత్యవసర వసతులను ఇక్కడ కల్పిస్తారు.
మహానగర ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ (HMDA పరిధి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. 'ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా కార్మికుల దైనందిన ఆచరణాత్మక అవసరాలను తీర్చే సురక్షితమైన ప్రదేశాలను అందుబాటులోకి తెస్తున్నాం. ఏ సంస్థలో పనిచేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతి కార్మికుడికి ఈ కేంద్రాలు స్వాగతం పలుకుతాయి.' అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}మహానగర ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ (HMDA పరిధి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. 'ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా కార్మికుల దైనందిన ఆచరణాత్మక అవసరాలను తీర్చే సురక్షితమైన ప్రదేశాలను అందుబాటులోకి తెస్తున్నాం. ఏ సంస్థలో పనిచేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతి కార్మికుడికి ఈ కేంద్రాలు స్వాగతం పలుకుతాయి.' అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}నగర అభివృద్ధిలో గిగ్ వర్కర్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని జయేశ్ రంజన్ అన్నారు. రోజంతా రోడ్లపై తిరుగుతూ పని చేసే కార్మికుల కోసం నగరంలో మౌలిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్‌లైన్ డెలివరీ సంస్థలతో ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.
నగరం క్రమంగా విస్తరిస్తున్న తరుణంలో, మారుతున్న కాలానికి అనుగుణంగా గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఇలాంటి ప్రభుత్వ రవాణా, పట్టణ మౌలిక వసతుల ఆధారిత ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.