ప్రజల సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకత, బాధ్యతాయుత పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 'ప్రజావాణి' కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రతి వారం సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
తహసీల్దార్, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, పోలీస్, ఇతర మండల స్థాయి శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వెంటనే చర్యలు చేపడతారు.
ప్రజావాణి వేదిక వద్ద కంప్యూటర్, స్కేనర్, ఇంటర్నెట్ వసతులతో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, ఫిర్యాదుదారునికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదును అందిస్తారు. పోర్టల్ నిర్వహణ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా లేదా డివిజన్ స్థాయిలో ముందస్తు శిక్షణ ఇస్తారు.
వికలాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, బాలింతలకు అర్జీల సమర్పణలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మంచినీరు, కూర్చోవడానికి సీటింగ్, హెల్ప్‌డెస్క్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. ప్రజా సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
అంతేకాకుండా దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, పసిపిల్లలతో వచ్చే మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి నుండి వినతులను స్వీకరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. వీరికి వీల్ చైర్ సదుపాయంతో పాటు, పాత అర్జీల పురోగతిని తెలుసుకునే హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ జీవో ఆధారంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తక్షణమే మండల ప్రజావాణిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
{{/usCountry}}అంతేకాకుండా దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, పసిపిల్లలతో వచ్చే మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి నుండి వినతులను స్వీకరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. వీరికి వీల్ చైర్ సదుపాయంతో పాటు, పాత అర్జీల పురోగతిని తెలుసుకునే హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ జీవో ఆధారంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తక్షణమే మండల ప్రజావాణిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
{{/usCountry}}