...
...
Next Story

టీసీ కోసం వస్తే ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరికిన విద్యార్థి!

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో దారుణమైన ఘటన జరిగింది. టీసీ కోసం వచ్చిన విద్యార్థిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ప్రిన్సిపాల్. దీంతో విద్యార్థి అతడి ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు.

Published on: Jul 8, 2026, 16:37:28 IST
Advertisement

విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ దారుణంగా వ్యవహరించాడు. కామాంధుడిగా మారి విద్యార్థి జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేశాడు. ఈ దారుణమైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో జరిగింది. టీసీ కోసం వచ్చిన ఒక విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిని సహించని విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నాడు ఓ విద్యార్థి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్(టీసీ) కోసం కళాశాల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ప్రిన్సిపాల్ మాత్రం టీసీ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇదే అదనుగా భావించిన సదరు ప్రిన్సిపాల్ కొంతకాలంగా ఆ విద్యార్థిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాడు.

అయితే మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో విద్యార్థిని కాలేజీలోనే ఉన్న తన వ్యక్తిగత గదికి ప్రిన్సిపాల్ పిలిపించుకున్నాడు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే తను చెప్పినట్టు చేయాలని, విద్యార్థిపై బలవంతంగా లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రిన్సిపాల్ చేస్తున్న అకృత్యాలను, చిత్రహింసలను భరించలేకపోయిన బాధితుడు.. ఆ నరకం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. ఆత్మరక్షణ కోసం తీవ్ర ఆగ్రహంతో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్‌ను గట్టిగా కొరికేశాడు.

నొప్పితో ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నాడు. బాధితుడు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని తోటి విద్యార్థుల వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న విద్యార్థులంతా కలిసి వెంటనే ప్రిన్సిపాల్ ఉన్న దగ్గరకు చేరుకున్నాడు. భారీ సంఖ్యలో విద్యార్థులు రావడంతో భయంతో నగ్నంగానే అక్కడి నుంచి చీకట్లోకి పారిపోయాడు ప్రిన్సిపాల్.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks