...
...
Next Story

Indiramma Housing Towers : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేశారా..? డిపాజిట్ సొమ్ము రీఫండ్ షురూ, ఈలోపు దరఖాస్తు చేసుకోండి!

Indiramma Housing Scheme Towers : ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకం లాటరీలో ఎంపిక కాని వారికి రూ.10,000 ధరావతు సొమ్మును హౌసింగ్ బోర్డు రీఫండ్ చేస్తోంది. మీసేవా కేంద్రాల్లో నగదు రూపంలో కట్టినవారు సెప్టెంబరు 10లోగా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Sep 9, 2026, 07:36:28 IST
Advertisement

Indiramma Housing Scheme Towers : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' పథకంలో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ - EMD) సొమ్మును తిరిగి చెల్లించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.

ఇందిరమ్మ టవర్స్
ఇందిరమ్మ టవర్స్

హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం గతంలో డిమాండ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా ప్రజల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరి నుంచి ధరావతు కింద రూ.10,000 వసూలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాల ద్వారా ఈ దరఖాస్తు ప్రక్రియను చేపట్టడంతో పాటు… ఈఎండీ మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలోనే స్వీకరించారు.

మీ ఖాతాల్లోకే నేరుగా రూ.10,000

ఈ ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. లాటరీలో ఇండ్లు దక్కని, ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10,000 ధరావతు మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు ఏ బ్యాంక్ ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించారో, అదే ఖాతాకు ఈ సొమ్ము నేరుగా జమ అవుతుందని తెలిపారు. దీనికోసం అర్హులైన ప్రజలు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లోగా రీఫండ్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.

మీసేవాలో నగదు చెల్లించిన వారు ఏం చేయాలి?

ఇలా నగదు రూపంలో లేదా ఇతరుల ఖాతాల ద్వారా డబ్బులు చెల్లించిన అసలైన లబ్ధిదారులకు నష్టం జరగకుండా, ఆ ధరావతు సొమ్ము నేరుగా వారి సొంత బ్యాంక్ ఖాతాల్లోకే చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం సంబంధిత బాధితులు హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ( http://tghb.telangana.gov.in ) సందర్శించి, తమ సొంత బ్యాంక్ వివరాలను నమోదు చేస్తూ ఈ నెల 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వి.పి. గౌతమ్ సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోకపోతే, ఆ సొమ్ము మొదట ఏ ఖాతా నుంచి జమ అయిందో, తిరిగి అదే ఖాతాకు వెళ్లిపోతుందని హెచ్చరించారు.

మరోవైపు…. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లాటరీలో ఎంపికైన విజేతల వివరాల పరిశీలన ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని వైస్ చైర్మన్ తెలిపారు. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అధికారిక ఇండ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, పథకం కింద లబ్ధిదారులు మిగిలిన మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలి, ఏ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి అనే పూర్తి వివరాలను అలాట్‌మెంట్ లెటర్‌లోనే స్పష్టంగా పొందుపరుస్తామని ఆయన వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks