TG Farmer Kits : రాష్ట్రంలోని రైతులకు 'ఫార్మర్ కిట్స్' పంపిణీ - కిట్ లో ఏముంటాయంటే..?

 Telangana Govt Farmer Kits : రైతులకు ఫార్మర్ కిట్స్ రాష్ట్రంలో ఫార్మర్ కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. 489 క్లస్టర్ల నుండి ప్రతి క్లస్టర్‌కు 125 మంది రైతులను ఎంపిక చేసి వారికి అవగాహనతో పాటు ప్రత్యేక ఫార్మర్ కిట్లను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు.

Published on: Mar 17, 2026, 22:20:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా…. ఫార్మర్ కిట్స్ కార్యక్రమైంది. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన ‘రైతు నేస్తం’వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రైతులకు ఫార్మర్ కిట్స్
రైతులకు ఫార్మర్ కిట్స్

ఫార్మర్ కిట్స్ పంపిణీ ప్రారంభం…

రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులకు ప్రత్యేక ‘ఫార్మర్ కిట్స్’ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ….. రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల మానవ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతున్న తరుణంలో…. మన పూర్వీకులు ఆచరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులే రైతులకు, సమాజానికి క్షేమకరమని స్పష్టం చేశారు.

  • రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లను గుర్తించి… ఒక్కో క్లస్టర్ నుండి 125 మంది చొప్పున మొత్తం 61,125 మంది రైతులను ఈ పథకం కోసం ఎంపిక చేశారు.
  • వీరికి అవగాహన తో పాటుగా ఫార్మర్ కిట్లను అందజేశారు.
  • ఈ కిట్స్ లో ప్రకృతి వ్యవసాయంపై “క్షేత్ర దర్శిని” పుస్తకం, క్లాత్ బ్యాగ్, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ తో పాటు చిన్న డైరీ ఉంటాయి.
  • సచివాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో…. ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఫార్మర్ కిట్లను పంపిణీ చేస్తారు.
  • ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు మార్చి 20, 21, 22 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న ‘రైతు మహోత్సవ’ కార్యక్రమానికి రైతులు భారీగా తరలిరావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరి రోజున (మార్చి 22) సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More