చర్లపల్లి - షాలిమార్ ట్రైన్ అప్డేట్ - కొత్తగా మరో స్టాపేజీ..! ఎక్కడంటే..?

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి - షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు కొత్తగా 

Published on: Mar 16, 2026, 19:44:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి - షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు కొత్తగా మరో స్టాపేజీ ఉండనుంది. ఇకపై ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఉన్న బస్తా రైల్వే స్టేషన్ లో కూడా ఆగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

చర్లపల్లి - షాలిమార్ ఎక్స్ ప్రెస్ ((PTI Photo))
చర్లపల్లి - షాలిమార్ ఎక్స్ ప్రెస్ ((PTI Photo))

కొత్త స్టాపేజీ….

చర్లప్లలి - షాలిమార్ - చర్లపల్లి మధ్య నడిచే ( ట్రైన్ నెంబర్18046/45) ట్రైన్ బస్తా రైల్వే స్టేషన్ లో ఆగనుంది. ఈ నిర్ణయం మార్చి 17వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. చర్లపల్లి నుంచి బయల్దేరే ఈ రైలు ఉదయం 08:40 గంటలకు ప్రారంభమై…. మరుసటి రోజు మధ్యాహ్నం 15:35 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ కాజీపేట, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్ పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… ఈ ట్రైన్ ఇకపై ఒడిశాలోని బస్తా రైల్వే స్టేషన్ లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

తాజా నిర్ణయం ప్రకారం…. చర్లపల్లి - షాలిమార్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18046) ఉదయం 9.36 నిమిషాలకు బస్తా రైల్వే స్టేషన్ కు చేరుకొని... ఉదయం 9.37 నిమిషాలకు బయల్దేరుతుంది. ఇక షాలిమార్ - చర్లపల్లి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18045) ట్రైన్.... మధ్యాహ్నం 2.36 నిమిషాలకు బస్తా రైల్వే స్టేషన్ కు చేరుకుని... 2.37 నిమిషాలకు బయల్దేరుతుంది.

ప్రయోగత్మకంగా ఈ స్టాపేజీ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నిర్ణయం అమలు తర్వాత…. మరిన్ని వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More