...
...
Next Story

ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలు రావాలి.. ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది : పీవీ సింధు

తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పారు. మరోవైపు మంత్రి కొండా సురేష్ ఇందిరమ్మ చీరలో కనిపించారు.

Published on: Dec 9, 2025, 14:36:33 IST
Advertisement

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు అయ్యారు. బలమైన క్రీడా వ్యవస్థ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తు్న్నారన్నారు. ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలు ఏర్పాటు కావడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పారు. స్పోర్ట్స్ విషయంలో తన వంతుగా సాయం ఉంటుందన్నారు. అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్ వంటి ఇతర క్రీడా దిగ్గజాలతో కలిసి సింధు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పాల్గొన్నారు.

ఇందిరమ్మ చీరలో మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

మంత్రి కొండా సురేఖ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వద్ద ఇందిరమ్మ చీరలో కనిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇందిరమ్మ చీరలను అందిస్తోంది. నవంబర్ 19న ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు దశల్లో మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం

ఈ సమ్మిట్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశ ఎకానమీ చరిత్రలో లేని అత్యంత భారీ లక్ష్యాన్ని 2047 కోసం నిర్దేశించుకున్నామని భట్టి చెప్పారు. తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్టుగా వెల్లడించారు. 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్య్ం కోసం మూలధనం, ఉత్పాదకత పెంపు అంశపై సెషన్ నిర్వహించారు. ఇందులో భట్టి విక్రమార్కతోపాటుగా విజన్ డాక్యుమెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ ప్రసన్న క్రాంతి, ఐఎస్బీ ఫ్యాకల్టీ ఆదిత్య, పారిశ్రామికవేత్త పరుశురాం, ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

'తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మాత్రమే కాదు, భవిష్యత్ కోసం మేం చేస్తున్న ప్రతిజ్ఞ. తెలంగాణ ఎకానమీ 3 ట్రిలియన్ డాలర్లు చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉంది. దేశ ఎకానమీ చరిత్రలో లేని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఎకానమీ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉంది. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం.' అని భట్టి విక్రమార్క చెప్పారు.

టూరిజం పాత్ర కీలకం

'ఎకో టూరిజం నూతన అధ్యాయంగా నిలుస్తుంది. రాష్ట్ర విస్తీర్ణంలో 19 శాతం అడవులు ఉన్నాయి. ఈ నేలపై ఉన్న దేవాలయాలు కూడా మరింత అభివృద్ధికి నోచుకోవాలి. టూరిజం డిపార్ట్‌మెంట్‌తో కలిసి పని చేస్తున్నాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య 36కు పెరగడం హర్షణీయం. దేవాలయాల పరిరక్షణ కేవలం పరిపాలన అంశం మాత్రమే కాదు. జీవ వైవిద్య, ప్రజల సంస్కృతిని పరిరక్షించడం.' అని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe