తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం(PVNRTVU) పరిధిలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 117 బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయ విజ్ఞప్తి మేరకు పశుసంవర్ధక, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు వర్సిటీకి అధికారికంగా లేఖ పంపారు.

పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు, పరిశోధనా కేంద్రాల్లో అధ్యాపకుల కొరత ఉంది. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్ల కింద 117 బ్యాక్లాగ్ పోస్టులు దీర్ఘకాలికంగా భర్తీ కాకుండా మిగిలిపోయాయి. వీటికి తోడు గత రెండేళ్లలో పదవీ విరమణలు, ఇతర కారణాల వల్ల మరో 108 రెగ్యులర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 225 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని ఇటీవల వర్సిటీ పాలకమండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిని పరిశీలించిన సర్కార్, తొలుత రిజర్వేషన్ల వారీగా ఉన్న 117 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వ ఆదేశాలు అందడంతో విశ్వవిద్యాలయ అధికారులు నియామక ప్రక్రియపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ నెలాఖరులోపే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 67 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ : 50 పోస్టులు.. మొత్తం కలిపి 117 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
ఈ నియామకాలను అత్యంత పారదర్శకంగా విశ్వవిద్యాలయ పరిధిలోనే చేపట్టనున్నారు. యూజీసీ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు నిర్దేశిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ (M.V.Sc / M.Sc), పీహెచ్డీ (Ph.D) లేదా నెట్ (NET) అర్హతతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అవసరమైన బోధన, పరిశోధన అనుభవం తప్పనిసరి.
రాత పరీక్ష, అకడమిక్ ప్రతిభ, పరిశోధనా పత్రాలు, మౌఖిక పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. మొదటి విడతలో 117 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పట్టాలెక్కించిన వెంటనే, గత రెండేళ్లలో ఏర్పడిన మిగిలిన 108 రెగ్యులర్ ఖాళీల భర్తీకి కూడా విడిగా నోటిఫికేషన్ జారీ చేయాలని వర్సిటీ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం మరోసారి ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు అధికారులు.
{{/usCountry}}రాత పరీక్ష, అకడమిక్ ప్రతిభ, పరిశోధనా పత్రాలు, మౌఖిక పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. మొదటి విడతలో 117 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పట్టాలెక్కించిన వెంటనే, గత రెండేళ్లలో ఏర్పడిన మిగిలిన 108 రెగ్యులర్ ఖాళీల భర్తీకి కూడా విడిగా నోటిఫికేషన్ జారీ చేయాలని వర్సిటీ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం మరోసారి ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు అధికారులు.
{{/usCountry}}తెలంగాణలో పశువైద్య విద్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పశువుల వ్యాధుల నిర్ధారణలో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తోంది. రాజేంద్రనగర్ ప్రధాన క్యాంపస్‌తో పాటు కోరుట్ల, మామునూరు, గద్వాల, వరంగల్ తదితర ప్రాంతాల్లోని అనుబంధ కళాశాలలు, పరిశోధనా స్థానాల్లో అధ్యాపకుల కొరత వల్ల బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా 117 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం కావడంతో హర్షం వ్యక్తమవుతోంది.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.