ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

AP 3rd Phase Panchayat Elections : ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Published on: Nov 19, 2026, 12:24:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రాజకీయాల్లో సందడి మరింత పెరిగింది. రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇప్పటికే ఈ నెల 13న తొలి విడత, 16న రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, తాజా నోటిఫికేషన్‌తో మూడో దశ పోరుకు రంగం సిద్ధమైంది.

ఏపీ మూడో విడత పంచాయతీ ఎన్నికలు
ఏపీ మూడో విడత పంచాయతీ ఎన్నికలు

ఈ మూడో విడతలో రాష్ట్రంలోని పలు జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.

నవంబర్ 21ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ, వార్డు వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. నవంబర్ 21 నుంచి 23 వరకు అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు. నవంబర్ 24 దాఖలైన నామినేషన్ల పరిశీలన చేస్తారు. నవంబర్ 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 26న నామినేషన్ అప్పీళ్లను పరిష్కారిస్తారు.

నవంబర్ 27 నామినేషన్ల ఉపసంహరణను మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 27న పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 2పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాల ప్రకటన మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉంటుంది.

డిసెంబర్ 2న ఫలితాలు వెలువడిన వెంటనే అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆ రోజు వీలుకాకపోతే, మరుసటి రోజు సెలవు దినమైనప్పటికీ తప్పనిసరిగా ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఏదైనా పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే, డిసెంబర్ 3వ తేదీన ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిపి, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ చేపడతారు. రీపోలింగ్ జరిగిన పంచాయతీల్లో ఆ ఫలితాలు వచ్చిన తర్వాతే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నా లేదా ఏవైనా న్యాయ, పరిపాలనా పరమైన అడ్డంకులు ఉన్నా ఆయా పంచాయతీలు, వార్డులకు ఎన్నికల నోటీసు జారీ చేయవద్దని జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లో మూడో దశ పంచాయతీ పోరు జరగనుంది.

ఉత్తరాంధ్ర జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు.

కోస్తాంధ్ర జిల్లాలు: కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు.

రాయలసీమ జిల్లాలు: చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More