...
...
Next Story

Railway AI Assistants : రైల్వే ప్రయాణికుల కోసం ఏఐ అసిస్టెంట్లు - క్షణాల్లో కావాల్సిన సమాచారం, తెలుగులో కూడా మాట్లాడొచ్చు

Railway AI Assistant Bholu Mini Bholu Max : భారతీయ రైల్వే 'భోలు మినీ', 'భోలు మాక్స్' పేరుతో ఏఐ అసిస్టెంట్లను ప్రవేశపెట్టింది. తెలంగాణలోని మల్కాజిగిరి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. ఇవి ప్రయాణికులకు రైలు సమయాలు, ప్లాట్‌ఫారమ్ వివరాలను వాయిస్, టచ్ స్క్రీన్ ద్వారా అందిస్తాయి.

Published on: May 3, 2026, 06:18:40 IST
Advertisement

Railway AI Assistant Bholu Mini Bholu Max : భారతీయ రైల్వే డిజిటల్ విప్లవం దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రయాణికులకు సమాచారాన్ని మరింత సులభంగా, వేగంగా అందించేందుకు అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సాంకేతికతను పట్టాలెక్కించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మల్కాజిగిరి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో 'భోలు మినీ' (Bholu Mini), 'భోలు మాక్స్' (Bholu Max) పేరుతో సరికొత్త ఏఐ రోబోటిక్ అసిస్టెంట్లను ప్రారంభించింది.

దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆవిష్కరణ
దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆవిష్కరణ

రైల్వే స్టేషన్ కు వెళ్లగానే ఏ ప్లాట్‌ఫారమ్ కు వెళ్లాలో తెలియక, రైలు ఏ సమయానికి వస్తుందో అర్థం కాక అయోమయానికి గురయ్యే ప్రయాణికులకు ఈ ఏఐ అసిస్టెంట్లు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాయి. ఇవి కేవలం యంత్రాలు మాత్రమే కావు, ప్రయాణికులతో నేరుగా సంభాషిస్తాయి.

ప్రత్యేకతలు….

ఈ స్మార్ట్ అసిస్టెంట్లలో అత్యాధునిక టచ్ స్క్రీన్ సదుపాయంతో పాటు వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉంది. ప్రయాణికులు తమకు కావాల్సిన సమాచారాన్ని కేవలం మాటల ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. ప్రధానంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి బహుళ భాషల్లో ఇవి సమాచారాన్ని అందిస్తాయి. దీనివల్ల భాషా సమస్య లేకుండా చదువుకోని వారు, వృద్ధులు సైతం తమకు కావాల్సిన వివరాలను సులభంగా పొందే వీలుంటుంది.

ఏయే సమాచారం లభిస్తుంది?

  • రైళ్ల రాకపోకల సమయాలు
  • రైళ్లు వచ్చే ప్లాట్‌ఫారమ్ నంబర్లు
  • స్టేషన్ లో అందుబాటులో ఉన్న వసతులు (వెయిటింగ్ రూమ్స్, ఎస్కలేటర్లు, లిఫ్టులు)
  • టికెట్ కౌంటర్లు మరియు ఎంక్వైరీ వివరాలు

"సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఏఐ అసిస్టెంట్లను ఏర్పాటు చేశాం. ఇవి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఎంక్వైరీ కౌంటర్ల వద్ద ఒత్తిడిని తగ్గిస్తాయి" అని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మల్కాజిగిరి, కాచిగూడ వంటి రద్దీ స్టేషన్లలో ఈ ప్రయోగం విజయవంతమైతే, రానున్న రోజుల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు.

జవాబు: ఇవి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన కృత్రిమ మేధ (AI) ఆధారిత సమాచార అసిస్టెంట్లు. ఇవి ప్రయాణికుల ప్రశ్నలకు వాయిస్ మరియు టచ్ స్క్రీన్ ద్వారా సమాధానాలు ఇస్తాయి.

ప్రశ్న: ఇవి ఏ భాషల్లో అందుబాటులో ఉన్నాయి?

జవాబు: ఇవి తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రయాణికులతో సంభాషిస్తాయి.

ప్రశ్న: ప్రస్తుతానికి ఇవి ఏ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి?

జవాబు: తెలంగాణలోని మల్కాజిగిరి మరియు కాచిగూడ రైల్వే స్టేషన్లలో వీటిని అధికారులు ఏర్పాటు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe