Hyderabad Sunnam Cheruvu : అర్ధరాత్రి వర్షం - ప్రారంభానికి ముందే సున్నం చెరువుకు జలకళ

డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న సున్నం చెరువులోకి వర్షపు నీరు చేరింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వానతో చెరువు జలకళ సంతరించుకుంది. ఇక ఆక్రమణల నుంచి విముక్తి చేసి 32 ఎకరాలకు విస్తరించిన హైడ్రా చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Published on: Nov 27, 2026, 14:30:05 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ సున్నం చెరువులోకి వర్షపు నీరు చేరింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో చెరువు సరికొత్త జలకళను సంతరించుకుంది. కొద్దిపాటి వర్షం పడినా వరద నీరు చెరువులోకి చేరేలా అధికారులు ఇన్లెట్లను అభివృద్ధి చేయటంతో…పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు నేరుగా సున్నం చెరువులోకి చేరింది.

సున్నం చెరువు
సున్నం చెరువు

డిసెంబర్ 2 లేదా 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో వర్షం కురవడం, ఆ నీరు చెరువులోకి చేరడం మంచి పరిణామంగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు.

ఆక్రమణల నుంచి 32 ఎకరాలకు విస్తరణ

గతంలో ఆక్రమణలకు గురై, మురికి కూపంగా మారిన సున్నం చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఒకప్పుడు 14 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువు విస్తీర్ణాన్ని హైడ్రా 32 ఎకరాలకు పెంచింది. చెరువుకు పూర్వ వైభవం తీసుకురావడానికి చేపట్టిన చర్యలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి.

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న వేళ…. శుక్రవారం కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చిందని స్థానికులు చెప్పారు. సున్నం చెరువులోకి వర్షపు నీరు చేరుతున్న దృశ్యాలను ఫొటోలు, వీడియోలుగా తీసి హైడ్రాకు పంపారు. చెరువులో నీళ్లు చేరడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఆక్రమణలకు గురైన సున్నం చెరువు… మురికి కూపంగా, దుర్గంధ భరితంగా మారింది. ఆక్రమణలతో 14 ఎకరాలకు పరిమితమైన చెరువును హైడ్రా 32 ఎకరాలకు విస్తరించింది. FTL పరిధిలో ఆక్రమణలు తొలగించిన సమయంలో ఎన్నో నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం 1.35 కిలోమీటర్ల పాత్ వే స్థానికులకు ఆరోగ్య ప్రదాయినిగా మారింది. అన్ని వయసులవారికి దేహదారుఢ్యానికి ఊతమిచ్చేలా అక్కడ ఓపెన్ జిమ్ తయారయ్యింది. అంతే కాదు గుట్టలబేగంపేట, నవభారత నగర్ తదితర ప్రాంతాలకు వరద ముప్పును సున్నం చెరువు తప్పించింది.

గతంలో 47.58 మిలియన్ లీటర్లకు పరిమితమైన చెరువు… ఇప్పుడు నీటి నిలువ సామర్థ్యం 200 మిలియన్ లీటర్ల కు పెరిగింది. నీరు నిలువ ఉండే ప్రాంతం 9 ఎకరాల నుంచి 16 ఎకరాలకు పైగా పెరిగింది. చెరువుకు ఇన్లెట్లు, ఔట్లెట్లు సరి చేయడంతో పాటు అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతానికి వరద ముప్పు తప్పింది. పార్కులు ఆహ్లాదాన్ని అందిస్తుండగా.. పెద్ద రాతి కొండపై హైడ్రా ఏర్పాటు చేసిన చెరువు వ్యూ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.