...
...
Next Story

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై అభ్యంతరాలు ఉన్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(ORR) పరిధిలోని ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌లో ఇటీవల లక్కీ డ్రా లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఫ్లాట్ల లబ్ధిదారులపై అభ్యంతరాలు తెలియజేయడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ప్రజలకు ఒక అవకాశాన్ని కల్పించింది.

Published on: Sep 3, 2026, 08:43:29 IST
Advertisement

తెలంగాణ హౌసింగ్ బోర్డు.. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారుల జాబితాపై ప్రజలు తమ అభ్యంతరాలను (Objections) తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. లాటరీ ద్వారా ఎంపికైన అభ్యర్థులలో ఎవరైనా అనర్హులు ఉన్నా, డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నా లేదా నిబంధనలు ఉల్లంఘించి ప్లాట్లు పొందినా, వారిపై అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని హౌసింగ్ బోర్డు తెలిపింది.

ఇందిరమ్మ ఇళ్లపై అభ్యంతరాలు
ఇందిరమ్మ ఇళ్లపై అభ్యంతరాలు

అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in పోర్టల్‌ను సందర్శించి, ఎంపికైన లబ్ధిదారుల వివరాల పక్కన ఉన్న ‘Object’ (అభ్యంతరం) ఆప్షన్‌పై క్లిక్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. అభ్యంతరాలను సమర్పించడానికి సెప్టెంబర్ 4 ను చివరి తేదీగా గృహనిర్మాణ మండలి వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా ఎంపికైన లబ్ధిదారుల పేరు, తండ్రి/భర్త పేరు, చిరునామా, ప్రాంతం, సెలక్షన్ స్టేటస్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి లబ్ధిదారుని వివరాల పక్కన ‘ఆబ్జెక్ట్’ (object) అనే ట్యాబ్ ఏర్పాటు చేశారు.

దరఖాస్తుదారుడికి లేదా వారి కుటుంబ సభ్యులకు కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు. గతంలో ప్రభుత్వ రీత్యా ఎలాంటి ఉచిత/సబ్సిడీ గృహ సదుపాయం పొంది ఉండకూడదు. దరఖాస్తుదారుడు సదరు నియోజకవర్గానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి.

ప్రస్తుతం హౌసింగ్ బోర్డు అధికారులు లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత, అర్హులైన అభ్యర్థులకు వారం రోజుల్లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్లు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks