రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉపవాస మాసంలో సాయంత్రం 4 గంటలలోపు కార్యాలయం నుండి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉందని ప్రకటించింది.

జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(GAD) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారు తమ ఉపవాసం విరమించడానికి, మతపరమైన ప్రార్థనలు చేయడానికి త్వరగా కార్యాలయాన్ని వదిలి వెళ్ళవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పని చేయాల్సి రావచ్చు.
ఈ మేరకు పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు 4 గంటలకే పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వెసులుబాటు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న అందరు ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉపవాస మాసంలో ఉద్యోగులు మతపరమైన ఆచారాలను పాటించడంలో సహాయపడటానికి ఈ వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.
రంజాన్ మాసం ప్రారంభం అనేది ఆకాశంలో నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది భారత్‌లో ఫిబ్రవరి 18 లేదా 19 నుంచి ఉపవాస దీక్షలు మొదలుకానున్నాయి. సాధారణంగా సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిన మరుసటి రోజున భారత్‌లో రంజాన్ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది.
ఇస్లాం ప్రకారం అందరూ ఉపవాసం ఉండాలని నియమం ఉన్నప్పటికీ, కొందరికి మినహాయింపులు ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్నవారు, ప్రయాణాల్లో ఉన్నవారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అయితే వారు కోలుకున్నాక లేదా ప్రయాణం ముగిశాక తప్పిపోయిన రోజులకు బదులుగా మరే రోజైనా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో
పవిత్రమైన రంజాన్ మాసం ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చింది. అయితే సుమారు 31 ఏళ్ల తర్వాత రంజాన్ మాసం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. గతంలో 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్ మాసం ప్రారంభమైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో మెుదలైంది.
{{/usCountry}}పవిత్రమైన రంజాన్ మాసం ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చింది. అయితే సుమారు 31 ఏళ్ల తర్వాత రంజాన్ మాసం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. గతంలో 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్ మాసం ప్రారంభమైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో మెుదలైంది.
{{/usCountry}}ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. రంజాన్ నెలవంక దర్శనం తర్వాత ప్రారంభం అవుతుంది. మత విశ్వాసాల ప్రకారం.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించాలి. వీటిని మూడు అష్రాలుగా విభజించారు. మెుదటి పది రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్, రెండో 10 రోజుల కాలాన్ని బర్కత్, చివరి 10 రోజుల ఉపవాసాన్ని మగ్ఫిరత్ అంటారు.