తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(TG BIE) ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు రియల్ టైమ్ సీసీటీవీ పర్యవేక్షణను ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లోని కీలక ప్రదేశాలలో కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో ఏడు నుండి ఎనిమిది సీసీటీవీ కెమెరాల వరకు అమర్చారు. ఈ కెమెరాలు చీఫ్ సూపరింటెండెంట్ గది, కారిడార్లు, ప్రధాన ద్వారం, పరీక్ష కేంద్రాల వెనుక వైపు కవర్ చేస్తాయి. ఆల్‌రెడీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రశ్నపత్రాలు సమయానికి తెరవబడుతున్నాయో లేదో అధికారులు పర్యవేక్షిస్తారు. ఆలస్యంగా వచ్చిన వారిని ట్రాక్ చేస్తారు, పరీక్షా హాళ్లలోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లకుండా చూసుకుంటారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించిన సీసీటీవీ ఫీడ్‌ల ద్వారా తెలంగాణ ఇంటర్ పరీక్షలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య తెలిపారు.
ఇక ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు కళాశాల లాగిన్లలో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 20 నుండి బోర్డు వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేస్తారు. విద్యార్థులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు డౌన్‌లోడ్ లింక్ అందుకుంటారు. హాల్ టిక్కెట్లను మీసేవా కేంద్రాల నుండి కూడా పొందవచ్చు.
విద్యార్థులు చేతి గడియారాలు ధరించడానికి అనుమతి ఉండదు కాబట్టి, అన్ని పరీక్షా కేంద్రాలలో గోడ గడియారాలు అమర్చుతారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించారు. పలువురు విద్యార్థులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు.
టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:
25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
{{/usCountry}}25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
{{/usCountry}}27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1