ఏవేవో పేర్లు చెప్పి ఫీజులు బాదితే కుదరదు.. ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు!

College Fee : కాలేజీల్లో ఫీజులపై తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏవేవో పేర్లు పెట్టి అధికంగా ఫీజులు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.

Published on: Mar 10, 2026, 17:39:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ సహా పలు ప్రొఫెషనల్ కాలేజీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్యూషన్ ఫీజు తప్ప ఇతర పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఇటీవలే ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కాలేజీల ఫీజును ఖరారు చేసిన విషయం తెలిసిందే.

స్పెషల్ ఫీజుపై ప్రభుత్వం ఆదేశాలు
స్పెషల్ ఫీజుపై ప్రభుత్వం ఆదేశాలు

గతంలో కాలేజీలు స్పెషల్ ఫీజు పేరుతో రూ.8,500 వరకు వసూలు చేసేవి. కొన్ని కాలేజీలు అనధికారికంగా రూ.12,000 నుంచి రూ.16,000 వరకు కూడా తీసుకుంటుండేవి. ఇప్పుడు ఆ అదనపు ఫీజులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేట్ కాలేజీలు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.8,500 స్పెషల్ ఫీజు రద్దు చేసింది. అడ్మిషన్, ల్యాబ్, లైబ్రరీ పేర్లతో అదనపు ఫీజులకు నో చెప్పింది. ఏవేవో పేర్లు చెప్పి ఫీజులను వసూలు చేయకూడని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది.

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ కాలేజీల ఫీజులను ఇటీవలే ప్రభుత్వం ఖరారు చేసింది. మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌ను నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి మూడు సంవత్సరాలపాటు ఫీజులు కొనసాగుతాయి. ఈసారి చాలా కాలేజీలకు షాక్ ఇచ్చింది సర్కార్. కొన్ని కాలేజీల ఫీజును తగ్గించింది. కొన్ని కాలేజీలకు ఫీజును పెంచింది.

ఇక ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప.. మరే ఇతర పేర్లతో ఫీజును వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒక్క రూపాయి కూడా అధికంగా విద్యార్థుల నుంచి వసూలు చేయెుద్దని తెలిపింది. కొత్త ఫీజులను ఖరారు చేసే సమయంలో విద్యాశాఖ, తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ చర్చలు చేసింది. ట్యూషన్ ఫీజు తప్ప.. ఇతర పేర్లు చెప్పి వసూలు చేయడానికి వీల్లేదని చెప్పి.. ఈ మేరకు జీవో విడుదలైంది. అందుకే జీవోలో ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు.

విద్యార్థులు కాలేజీల్లో జాయిన్ అయ్యేటప్పుడు.. రిజిస్ట్రేషన్ పేరుతో రూ.2000 తీసుకునేవి. ఇందులో రూ.500 యూనివర్సిటీకి వెళ్లేవి. రీడింగ్ రూమ్, కాలేజీ మ్యాగజేన్, కంప్యూటర్, ఇంటర్నెట్.. ఇలా పలు పేర్లతో రూ.1000 చెల్లించేవారు. కాలేజీలకు యూనివర్సిటీలు కామన్ సర్వీస్ అందించడానికి రూ.1500 చెల్లించాలి. పాఠ్య ప్రణాళిక మార్పు, వెబ్‌సైట్ నిర్వహణ, అధ్యాపకులు శిక్షణ తదితర సర్వీసులకు వసూలు చేసేవారు. లైబ్రరీ, ప్రయోగశాల డిపాజిట్ కింద రూ.1000 చెల్లించాలి. కాలేజీల్లోని కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు ఉంటే.. అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీ అదనంగా ఏడాదికి మరో రూ.3 వేలు చెల్లించాలి. అయితే తాజాగా వీటిపై జీవోలో క్లారిటీ ఇవ్వలేదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More