మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు - ఏ స్థానం ఎవరికంటే..?
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలకమైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీలకు కేటాయించగా…. 38 పీఠాలను బీసీలకు కేటాయించారు.

కీలకమైన హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మహిళా జనరల్ కు కేటాయించగా…గ్రేటర్ వరంగల్ జనరల్ గా నిర్ణయించారు. కరీంనగర్ కార్పొరేషన్- బీసీ జనరల్, కొత్తగూడెం కార్పొరేషన్- ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్- ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.
- నల్గొండ కార్పొరేషన్-మహిళా జనరల్
- నిజామాబాద్ కార్పొరేషన్- మహిళా జనరల్
- మహబూబ్‌నగర్ కార్పొరేషన్- బీసీ మహిళ
- మంచిర్యాల కార్పొరేషన్- బీసీ జనరల్
- ఖమ్మం కార్పొరేషన్-మహిళా జనరల్
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం…. జీహెచ్ఎంసీ కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు.
కీలకమైన రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలు సంఘం ఏర్పాట్లపై దష్టిపెట్టింది. ఇటీవలనే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది.
రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం… నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోనూ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 56,664 మంది మహిళలు ఉన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

