తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రామగుండంతో పాటు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీసులో మొత్తం 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 40 ఖాళీలలో 35 పోస్టులు రామగుండం యూనిట్ పరిధిలోనే ఉండడం విశేషం. మిగిలిన 5 పోస్టులు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీస్‌కు కేటాయించారు.

కెమికల్-18, మెకానికల్-03, ఎలక్ట్రికల్-03, ట్రాన్స్‌పోర్టెషన్-01, హ్యూమన్ రిసోర్స్-02, మెడికల్-02, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-06, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-01 పోస్టులు ఉన్నాయి. పోస్టుల ఆధారంగా జీతాలు ఉన్నాయి. RFCL సంస్థ పరిశ్రమలోనే అత్యుత్తమ వేతన ప్యాకేజీలను అందిస్తోంది.
ఇంజనీర్ / ఆఫీసర్ పే స్కేల్ రూ.40,000 - రూ.1,40,000, అసిస్టెంట్ మేనేజర్ పే స్కేల్ రూ.50,000 - రూ.1,60,000, డిప్యూటీ మేనేజర్ రూ.60,000 - రూ.1,80,000, మెడికల్ ఆఫీసర్లు రూ.70,000 నుండి రూ.2,20,000, చీఫ్ మేనేజర్ పే స్కేల్ రూ.90,000 - రూ.2,40,000గా జీతాలు ఉన్నాయి. ప్రాథమిక వేతనంతో పాటు ఇండస్ట్రియల్ కరువు భత్యం (IDA), బేసిక్ పేలో 35 శాతం ఇతర అలవెన్సులు, కంపెనీ వసతి/HRA, మెడికల్, గ్రాట్యుటీ, పీఎఫ్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వర్తిస్తాయి.
సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో B.E / B.Tech / B.Sc, CA/CMA/MBA/PG డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పోస్టును బట్టి 1 సంవత్సరం నుండి 18 సంవత్సరాల వరకు సంబంధిత పరిశ్రమలలో ఎగ్జిక్యూటివ్ స్థాయి అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది.
దరఖాస్తు రుసుము రూ.700 నుంచి రూ.1,000 వరకు ఉంది. SC / ST / PwBD / ExSM / డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
{{/usCountry}}దరఖాస్తు రుసుము రూ.700 నుంచి రూ.1,000 వరకు ఉంది. SC / ST / PwBD / ExSM / డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
{{/usCountry}}ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటౌట్‌ను హార్డ్ కాపీ రూపంలో పోస్టు ద్వారా నోయిడా ఆఫీసుకు పంపడం రెండూ తప్పనిసరి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 26.08.2026 (ఉదయం 8:00 గంటల నుండి) నుంచి చివరి తేదీ 24.09.2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) ఉంది. హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ 01.10.2026 (దూర ప్రాంతాల అభ్యర్థులకు 08.10.2026)గా నిర్ణయించారు.
హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా: Dy. General Manager (HR), Ramagundam Fertilizers and Chemicals Limited, Corporate Office, 4th Floor, Wing - A, Kribhco Bhawan, Sector-1, Noida, Uttar Pradesh - 201301.
అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు, ధృవీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం RFCL అధికారిక వెబ్‌సైట్ https://www.rfcl.co.inని సందర్శించవచ్చు.
కింద నోటిఫికేషన్ పీడీఎఫ్ చూడండి..