RFCL Recruitment 2026 : భారీ జీతంతో రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు

RFCL Recruitment 2026 : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) రామగుండంతోపాటుగా నోయిడా కార్పొరేట్‌ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు వెంటనేవీటికి అప్లే చేయాలి.

Updated on: Aug 27, 2026, 13:34:48 IST
By , Ramagundam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రామగుండంతో పాటు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీసులో మొత్తం 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 40 ఖాళీలలో 35 పోస్టులు రామగుండం యూనిట్ పరిధిలోనే ఉండడం విశేషం. మిగిలిన 5 పోస్టులు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీస్‌కు కేటాయించారు.

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు

కెమికల్‌-18, మెకానికల్‌-03, ఎలక్ట్రికల్‌-03, ట్రాన్స్‌పోర్టెషన్‌-01, హ్యూమన్‌ రిసోర్స్‌-02, మెడికల్‌-02, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్-06, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-01 పోస్టులు ఉన్నాయి. పోస్టుల ఆధారంగా జీతాలు ఉన్నాయి. RFCL సంస్థ పరిశ్రమలోనే అత్యుత్తమ వేతన ప్యాకేజీలను అందిస్తోంది.

ఇంజనీర్ / ఆఫీసర్ పే స్కేల్ రూ.40,000 - రూ.1,40,000, అసిస్టెంట్ మేనేజర్ పే స్కేల్ రూ.50,000 - రూ.1,60,000, డిప్యూటీ మేనేజర్ రూ.60,000 - రూ.1,80,000, మెడికల్ ఆఫీసర్లు రూ.70,000 నుండి రూ.2,20,000, చీఫ్ మేనేజర్ పే స్కేల్ రూ.90,000 - రూ.2,40,000గా జీతాలు ఉన్నాయి. ప్రాథమిక వేతనంతో పాటు ఇండస్ట్రియల్ కరువు భత్యం (IDA), బేసిక్ పేలో 35 శాతం ఇతర అలవెన్సులు, కంపెనీ వసతి/HRA, మెడికల్, గ్రాట్యుటీ, పీఎఫ్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వర్తిస్తాయి.

సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో B.E / B.Tech / B.Sc, CA/CMA/MBA/PG డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పోస్టును బట్టి 1 సంవత్సరం నుండి 18 సంవత్సరాల వరకు సంబంధిత పరిశ్రమలలో ఎగ్జిక్యూటివ్ స్థాయి అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది.

దరఖాస్తు రుసుము రూ.700 నుంచి రూ.1,000 వరకు ఉంది. SC / ST / PwBD / ExSM / డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటౌట్‌ను హార్డ్ కాపీ రూపంలో పోస్టు ద్వారా నోయిడా ఆఫీసుకు పంపడం రెండూ తప్పనిసరి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 26.08.2026 (ఉదయం 8:00 గంటల నుండి) నుంచి చివరి తేదీ 24.09.2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) ఉంది. హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ 01.10.2026 (దూర ప్రాంతాల అభ్యర్థులకు 08.10.2026)గా నిర్ణయించారు.

హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా: Dy. General Manager (HR), Ramagundam Fertilizers and Chemicals Limited, Corporate Office, 4th Floor, Wing - A, Kribhco Bhawan, Sector-1, Noida, Uttar Pradesh - 201301.

అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు, ధృవీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం RFCL అధికారిక వెబ్‌సైట్ https://www.rfcl.co.inని సందర్శించవచ్చు.

కింద నోటిఫికేషన్ పీడీఎఫ్ చూడండి..

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More