జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలు పసుపుకోతకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. మల్లాపూర్ మండలం ముగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడికి గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు. సమాచారం అందిన వెంటనే.. న్యాల్‌కల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ అయింది.
ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని రెబ్బవరం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వృద్ధుడిని అతివేగంగా వచ్చిన ఒక వాహనం ఢీ కొట్టింది. మృతుడిని అదే గ్రామానికి చెందిన గుత్తా సత్యంగా గుర్తించారు. సత్యం తన గేదెలను ఎప్పటిలాగే మేతకు తీసుకెళ్తున్నాడు. రెబ్బవరం ప్రధాన రహదారి దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న ఒక వ్యాన్ వేగంతో వచ్చి ఆయనను ఢీకొట్టింది.
వాహనం బలంగా తగలడంతో సత్యం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో సత్యం శరీరానికి తీవ్రగాయాలు అయ్యాయి. తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో ఘటన స్థలంలోనే సత్యం ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


