హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండో కుమార్తె గాయాలతో బయటపడ్డారు. ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గచ్చిబౌలి సమీపంలో ప్రయాణించే సమయంలో వీరి ఫార్చ్యూనర్.. కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. ఈ సమయంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశర అందులోనే ఉన్నారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో కారు దెబ్బతిన్నది. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో పెద్ద కుమార్తె అక్షర తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కుమార్తె దిశర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం బాధితులిద్దరినీ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 2025లో చనిపోయారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో పలు బాధ్యతలను నిర్వర్తించారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గోపినాథ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది.
మాగంటి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మాగంటి మరణంపై రాజకీయం జరిగింది. మాగంటి భార్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ బరిలోకి దించింది. ఈ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే.
{{/usCountry}}మాగంటి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మాగంటి మరణంపై రాజకీయం జరిగింది. మాగంటి భార్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ బరిలోకి దించింది. ఈ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే.
{{/usCountry}}