టెన్త్, ఐటీఐ అర్హతతో ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్.. దక్షిణ మధ్య రైల్వేలో వెయ్యికిపైగా ఖాళీలు!

పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసినవారికి భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ఖాళీలకు నోటిఫికేషన్ వెలువరించింది. మెుత్తం ఖాళీల్లో దక్షిణ మధ్య రైల్వేలో వెయ్యికిపైగా పోస్టులు ఉన్నాయి.

Published on: Feb 2, 2026, 16:39:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రైల్వే ఇటీవల పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మెుత్తం 22,195 గ్రూప్‌ డి ఖాళీలకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వే(సికింద్రాబాద్) జోన్‌లోనూ పోస్టులు ఉన్నాయి. గ్రూప్ డీ(లెవెల్ 1)కు సంబంధించి 1012 ఖాళీలను భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. పదో తరగతి/ఐటీఐ అర్హత ఉన్నవారి కోసం ఈ మేరకు ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ చేస్తోంది.

దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు
దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు

గ్రూప్ డీ(లెవల్ 1) పోస్టులకు సంబంధించి పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు పలు విభాగాల్లో ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న మెుదలైంది. మార్చి2వ తేదీతో ముగియనుంది.

వయోపరిమితి

వయోపరిమితి విషయానికి వస్తే.. 01-01-2026 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు దొరుకుతుంది. ప్రారంభ వేతనం నెలకు రూ.18000 నుంచి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదల: 27.12.2025.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ : 31.01.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.03.2026.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు : 04.03.2026.

దరఖాస్తు సవరణ తేదీలు: 05.03.2026 నుంచి 14.03.2026.

ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు

అభ్యర్థులు ఎంపిక చేయడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌ తర్వాత రిక్రూట్‌ చేసుకుంటారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500(CBT రాస్తే రూ.400 రీఫండ్‌). ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత పూర్తి రీఫండ్‌ చేస్తారు.

ఈ లింక్ క్లిక్ చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More