Sanathnagar TIMS : సనత్‌నగర్ టిమ్స్ సిద్ధం..! రేపటి నుంచే ఓపీ సేవలు ప్రారంభం.. 22 విభాగాల్లో ట్రయల్ రన్...!

Sanathnagar TIMS OP Services : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మే 1 నుంచి అందుబాటులోకి రానుంది. నెల రోజుల పాటు ప్రయోగాత్మక ప్రాతిపదికన…. 22 విభాగాల్లో ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలను ప్రారంభించనున్నారు.

Published on: Apr 30, 2026, 20:50:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sanathnagar TIMS OP Services : హైదరాబాద్ నగరవాసులకు… ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువకానుంది. సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)లో శుక్రవారం (మే 1) నుంచి అవుట్ పేషెంట్ (OP) సేవలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు ట్రయల్ రన్ (ప్రయోగాత్మక నిర్వహణ)లో భాగంగా ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

శుక్రవారం నుంచి సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ట్రయల్ రన్
శుక్రవారం నుంచి సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ట్రయల్ రన్

ఉదయం 9 నుంచి 11 వరకు సేవలు

ప్రయోగాత్మక దశలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ మరియు డయాగ్నోస్టిక్ (వ్యాధి నిర్ధారణ పరీక్షలు) సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో వచ్చే రోగులకు వైద్య పరీక్షలతో పాటు అవసరమైన ప్రాథమిక పరీక్షలు కూడా అక్కడే నిర్వహిస్తారు. ఈ నెల రోజుల ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి, భవిష్యత్తులో పూర్తిస్థాయి సేవలను ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించాలని అధికారులు భావిస్తున్నారు.

సాధారణ ప్రభుత్వాసుపత్రులకు భిన్నంగా టిమ్స్ సనత్‌నగర్‌లో 22 రకాల వైద్య విభాగాలు కొలువుదీరాయి. ఇందులో ప్రధానంగా ఏం ఉన్నాయంటే..?

  • కార్డియాలజీ (గుండె సంబంధిత)
  • న్యూరాలజీ (నరాల సంబంధిత)
  • నెఫ్రాలజీ (కిడ్నీ సంబంధిత)
  • గ్యాస్ట్రో ఎంటరాలజీ
  • యూరాలజీ
  • జనరల్ మెడిసిన్ - జనరల్ సర్జరీ

ఈ కీలక విభాగాలతో పాటు మరికొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా ఈ ట్రయల్ రన్‌లో భాగం కానున్నాయి. ఇప్పటికే ఆయా విభాగాలకు అవసరమైన నిపుణులైన వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని ప్రభుత్వం అక్కడ నియమించింది.

మంత్రి దామోదర ఆదేశాలు

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఓపీ సేవల కోసం అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని…. మందుల లభ్యత మరియు పరీక్షల నిర్వహణలో సమన్వయం ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నగరంలోని నాలుగు దిక్కులా టిమ్స్ ఆసుపత్రులను నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా సనత్‌నగర్ టిమ్స్ కీలక అడుగు వేసింది. ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులపై ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More