గ్రామ పంచాయతీలకు సంక్రాంతి గిఫ్ట్.. రూ. 277 కోట్లు విడుదల

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కానుక అందించింది. రూ. 277 కోట్లను విడుదల చేసింది.

Published on: Jan 13, 2026, 21:11:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిధుల విడుదల జరిగింది. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల ఖర్చులను తీర్చడానికి నిధులను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా నిధులు విడుదలయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

ఈ శుభవార్తను గ్రామాలకు తెలియజేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

గతేడాది డిసెంబర్‌లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. నూతన సర్పంచ్‌‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నూతన సర్పంచులు ఉత్సహంగా పనులు మెుదలుపెట్టారు. అలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి కొత్తగా రూ.277 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నిధులు విడుదల కావడం గ్రామ పాలనకు మంచి ఆరంభాన్ని ఇస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక పనులు చేసేందుకు పంచాయతీలకు అవకాశం లభిస్తుంది. ప్రజలకు ఉపయోగపడే పనులపై నిధులు ఖర్చుకానున్నాయి.

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వానికి మెుదటి ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమనుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారానే.. సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More