విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త - తెలంగాణలో ఈసారి ఎక్కువగానే సంక్రాంతి సెలవులు..!
తెలంగాణలో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి ఉండనున్నాయి. ఈసారి వారం రోజుల పాటు హాలీ డేస్ ఉండనున్నాయి. తిరిగి జనవరి 17వ తేదీన తెరుచుకుంటాయి.
సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యార్థులు సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో సెలవులు ఖరారు కాగా… తెలంగాణలో మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది. ముందుగా ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం… సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు ఖరారు చేశారు.

అదనంగా మరో 2 రోజులు…!
అయితే ప్రస్తుతం పండుగల తేదీలు మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. దీంతో గతంలో ప్రకటించిన తేదీలు మారనున్నాయి. తాజాగా జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే జనవరి 17వ తేదీన శనివారం పాఠశాలలు తిరిగి పున: ప్రారంభమవుతాయి. విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే… 5 రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. అయితే పండగ తేదీలు మారిన నేపథ్యంలో… మరో 2 రోజులు పెరగనున్నాయి. అంటే ఈసారి 7 రోజులు ఉండనున్నాయి.
ఈసారి జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమగా ఉండనుంది. జనవరి 10న రెండో శనివారం కూడా కలిసి రావడంతో ముందు ప్రకటించిన సెలవుల్ని పునఃసమీక్షించారు. జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వస్తుందంటే చాలు సెలవుల కోసం బడి పిల్లలు ఎదురూచూస్తుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సొంత ఊర్లకి పయనమవుతారు. సరదాగా వారంరోజుల పాటు బంధువులు, గ్రామస్థులతో సంతోషంగా గడుపుతుంటారు. అయితే ప్రభుత్వం ప్రకటించే సెలవులను చూసుకునే…. వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈసారి కూడా సంక్రాంతి పండగకి ఎక్కువగానే సెలవులు ఉండటంతో ఎవరి ప్లాన్ లో వారు ఉన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

