కె.బి.ఆర్(కాసు బ్రహ్మానంద రెడ్డి) నేషనల్ పార్క్ చుట్టుపక్కల జరుగుతున్న చెట్ల నరికివేత, కొమ్మల కత్తిరింపును నిరసిస్తూ వందలాది మంది పౌరులు భారీ ప్రదర్శన చేపట్టారు. నగరంలోని ఈ కీలకమైన అడవిని రక్షించుకోవడానికి సాగుతున్న ఈ ఆందోళనలు నేటితో వరుసగా 10వ రోజుకు చేరుకున్నాయి.

#SaveKBR ఉద్యమ ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆసుపత్రి మధ్య ఉన్న సెంట్రల్ మీడియన్, ఒమేగా ఆసుపత్రి నుండి కేబీఆర్ మెయిన్ గేట్ వరకు ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లను తొలగించడంతో ఈ నిరసనలు ఉధృతమయ్యాయి.
H-CITI ప్రాజెక్ట్ పేరుతో పార్కు చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసమే ఈ విధ్వంసం జరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్వకేట్ డాక్టర్ లుబ్నా సర్వత్, విజయ్ మల్లంగి ఈ చెట్ల నరికివేతకు ఉన్న అనుమతులపై సమాచార హక్కు ద్వారా ఆరా తీస్తున్నారు. వాల్టా (WALTA) చట్టం కింద ట్రీ ప్రొటెక్షన్ కమిటీ ఇచ్చినట్లు చెబుతున్న అనుమతులు పారదర్శకంగా లేవని వారు ఆరోపించారు. నిర్ణీత 'ఫారమ్ 14' ద్వారా అధికారి నుండి రాతపూర్వక అనుమతి లేకుండా చెట్లను నరకడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
పబ్లిక్ పాలసీ నిపుణుడు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి స్పందిస్తూ.. ఫ్లైఓవర్ల పేరుతో కేబీఆర్ పార్కును నాశనం చేస్తున్నారని, ఇది వేయి గాయాలతో అడవిని చంపేయడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో ప్రధాన పిటిషనర్, కీలక కార్యకర్త కాజల్ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ ఉద్యమానికి కేవలం హైదరాబాద్ వాసుల నుండే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికుల నుండి మద్దతు లభిస్తోందని తెలిపారు.
మరోవైపు హెచ్‌సిటీ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీఆర్ఎస్ నేతలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘సేవ్ కేబీఆర్’ పేరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా కేబీఆర్ పార్కు చుట్టూ పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయన్నారు బీఆర్ఎస్ నేతలు. పార్కు చుట్టూ భారీ వృక్షాలు పెరిగి నగరవాసులకు ఆక్సిజన్ అందిస్తున్నాయని చెప్పారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణం అని విమర్శించారు.
{{/usCountry}}మరోవైపు హెచ్‌సిటీ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీఆర్ఎస్ నేతలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘సేవ్ కేబీఆర్’ పేరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా కేబీఆర్ పార్కు చుట్టూ పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయన్నారు బీఆర్ఎస్ నేతలు. పార్కు చుట్టూ భారీ వృక్షాలు పెరిగి నగరవాసులకు ఆక్సిజన్ అందిస్తున్నాయని చెప్పారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణం అని విమర్శించారు.
{{/usCountry}}