Telangana High Court Chief Justice : తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి - కొలీజియం సిఫార్సు

తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Published on: Oct 27, 2026, 09:36:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలోని నాలుగు కీలకమైన ఉన్నత న్యాయస్థానాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ పి శ్యాంకోశీని…. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి కల్పిస్తూ సిఫార్సు చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని కొలీజియం కీలక తీర్మానాన్ని ఆమోదించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

ఈ సిఫార్సుల ప్రకారం తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ తపబ్రత చక్రవర్తి నియమితులు కానున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ శ్యాంకోశీని దేశ రాజధాని ఢిల్లీ న్యాయస్థానానికి సీజేగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇక గుజరాత్ హైకోర్టులోనే న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మానస్ రంజన్ పాఠక్‌ను అదే కోర్టుకు చీఫ్ జస్టిస్‌గా ప్రమోట్ చేశారు. అలాగే పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ సింగ్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు కొలీజియం సిఫార్సు చేసింది.

గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. వారు ఇటీవల సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేయడంతో గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ ఉన్నత న్యాయస్థానాల్లో ప్రధాన న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలను భర్తీ చేస్తూ కొలీజియం తాజాగా ఈ నూతన నియామకాలను ఖరారు చేసింది. కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించిన అనంతరం రాష్ట్రపతి ఈ నియామక ఉత్తర్వులను అధికారికంగా జారీ చేస్తారు.

జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి ప్రస్థానం…

జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి పశ్చిమబెంగాల్‌లో జన్మించారు. 1991 జనవరి 29న కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సుమారు 22 ఏళ్లపాటు సివిల్‌, రాజ్యాంగ, సర్వీసు, విద్యాచట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు.

  • న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం గడించిన అనంతరం 2013 అక్టోబరు 30న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • అనంతరం 2026 జూన్‌ 21 నుంచి కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
  • తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More