బొగ్గు గని కార్మికుల ముఖాల్లో వెలుగులు నింపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికులకు దసరా పండుగ కానుకగా ప్రొఫిట్ షేరింగ్(లాభాల్లో వాటా) బోనస్‌ను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీ పర్మనెంట్ కార్మికుడికి రూ.1,51,912 బోనస్ రూపంలో అందనుంది. గతంతో పోలిస్తే ఇది అత్యధిక బోనస్. కేవలం పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా, కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా దసరా కానుకగా రూ.5,500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పండుగకు ముందే ఈ డబ్బులు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
సింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,754 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఇందులో 34 శాతం వాటాను అనగా దాదాపు రూ.596 కోట్లను కార్మికులకు పంపిణీ చేయనున్నారు. బొగ్గు ఉత్పత్తి పెంచడంలో, సంస్థను లాభాల బాటలో నడిపించడంలో రాత్రింబవళ్లు శ్రమించే కార్మికుల హక్కులను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 300 కారుణ్య నియామకాల ప్రక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ విరమణ చేసిన లేదా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఆధారపడిన కుటుంబ సభ్యులకు త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు.
కార్మికుల నివాస వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బొగ్గు గనుల తవ్వకాలు లేని, పర్యావరణపరంగా సురక్షితమైన ప్రాంతాలలో సింగరేణి కార్మికుల కోసం సమగ్ర ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ హౌసింగ్ కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పార్కులు, వినోద కేంద్రాలతో ఈ కాలనీలను అభివృద్ధి చేయనున్నారు.
{{/usCountry}}కార్మికుల నివాస వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బొగ్గు గనుల తవ్వకాలు లేని, పర్యావరణపరంగా సురక్షితమైన ప్రాంతాలలో సింగరేణి కార్మికుల కోసం సమగ్ర ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ హౌసింగ్ కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పార్కులు, వినోద కేంద్రాలతో ఈ కాలనీలను అభివృద్ధి చేయనున్నారు.
{{/usCountry}}ప్రభుత్వ ప్రకటనతో కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, గోదావరిఖని, భూపాలపల్లి ఏరియాల్లో కార్మికుల సంబరాలు మెుదలయ్యాయి. పండుగ వేళ ఇంత పెద్ద మొత్తంలో బోనస్ రావడం వల్ల కార్మికుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సింగరేణి సంస్థను మరింత లాభాల బాటలో పయనించేలా చేయడం మరియు కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.