వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్‌తో రామప్ప దేవాలయానికి ముప్పు లేదు : సింగరేణి
Venkatapur Opencast : రామప్ప దేవాలయానికి మైనింగ్ కార్యకలాపాలతో ముప్పు ఉందనే వార్తలపై సింగరేణి సంస్థ క్లారిటీ ఇచ్చింది. వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్‌తో రామప్ప దేవాలయానికి ముప్పు ఉంటుందనే ప్రచారంలో నిజం లేదని పేర్కొంది.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కాలం నాటి చారిత్రక రామప్ప దేవాలయానికి (రుద్రేశ్వర ఆలయం) మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రమాదం పొంచి ఉందంటూ వస్తున్న వార్తలపై సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) స్పష్టతనిచ్చింది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ మైనింగ్ వల్ల ఆలయానికి ముప్పు ఉందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది కేవలం అపోహ మాత్రమేనని సంస్థ యాజమాన్యం అధికారికంగా స్పష్టం చేసింది.

సింగరేణి సంస్థ ప్రతిపాదించిన వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాల సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. మైనింగ్ తవ్వకాలపై ఎలాంటి నిర్ణయమైనా ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ప్రతిష్టాత్మక శాస్త్రీయ పరిశోధనా సంస్థలు ఇచ్చే నివేదికలు, సిఫార్సుల ప్రాతిపదికన మాత్రమే ఉంటుందని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థగా తమకు సామాజిక, సాంస్కృతిక బాధ్యత ఉందన్న సింగరేణి.. ఎట్టి పరిస్థితుల్లోనూ రామప్ప దేవాలయానికి ఎలాంటి నష్టం చేకూర్చబోమని స్పష్టమైన హామీ ఇచ్చింది. కాకతీయుల కళాత్మక వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప ఆలయ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని పేర్కొంది.
పర్యావరణ పరిరక్షణ, చట్టబద్ధమైన నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తూ సుస్థిర విధానాల్లో మాత్రమే మైనింగ్ ప్రక్రియను చేపడతామని సింగరేణి సంస్త పునరుద్ఘాటించింది. నిపుణుల సలహాలు, శాస్త్రీయ ఆధారాలు, వారసత్వ సంపద పరిరక్షణ చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరమే వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌పై ముందడుగు వేస్తామని తెలిపింది.
13వ శతాబ్దంలో కాకతీయ గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం, సాండ్ బాక్స్ టెక్నిక్, నీటిపై తేలియాడే ఇటుకల నిర్మాణ శైలికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీని సమీపంలో బొగ్గు తవ్వకాల వల్ల ఆలయ నిర్మాణానికి ప్రకంపనల ముప్పు ఉంటుందని ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో సింగరేణి సంస్థ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.
'చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, శాస్త్రీయ పద్ధతులు, నిపుణుల మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతాం.' అని సింగరేణి అధికారికంగా స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


