Singareni : సింగరేణికి అవార్డులు... తెలంగాణలోని 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్
Singareni : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన సింగరేణికి చెందిన 5 ప్రధాన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది.
ఉత్తమ మైనింగ్ పద్ధతుల అమలు, పర్యావరణహిత చర్యలు, కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో సింగరేణి సంస్థ ఉత్తమ కంపెనీగా ఉంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 5 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా.. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు.

ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేఎన్టీ, ఆర్కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరీగూఢ ఓసీ, రామగుండం-3కి చెందిన ఆర్జీఓసీ-1 గనులు ఉన్నాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏడాది దేశంలో అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్‌ను ఇస్తుంది. అత్యుత్తమ స్టార్ రేటింగ్ సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులను.. అందిస్తూ ఉంటారు. ఇలా స్టార్ రేటింగ్ ఇవ్వడం కోసం బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులను కేటాయిస్తారు.
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు ఉన్న గనులపై 84 అంశాలను కేంద్ర బొగ్గు శాఖ నుంచి వచ్చిన బృందం పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత వీటి నుంచి అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వాటిలో ఇంకా అత్యుత్తమమైన వాటిని మరో కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధంగా సింగరేణి సంస్థలో ఈసారి ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం విశేషం.
ఈ గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందు వల్లే ఈ అవార్డులు సాధించినట్టుగా సింగరేణి చెబుతోంది. దీనిపై సీఎండీ శ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. గనుల యాజమాన్యాలకు, కార్మికులకు తన అభినందనలు తెలిపారు.
సింగరేణిలో ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడంపై సింగరేణి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలన్నారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరి సనోజ్ కుమార్ ఝా, కోల్ కంప్ట్రోలర్ సతీష్ కుమార్, కోల్ ఇండియా సీఎండీ సాయిరాం, సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే. వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి.శ్రీనివాస్, రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్, ఏజీఎం నరేందర్, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ2 మేనేజర్ రాజేశ్వర్, ఆర్కే న్యూటెక్ మేనేజర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


