...
...
Next Story

TG Scholarships : విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, ఇదే ఫైనల్ ఛాన్స్

Telangana ePass Scholarship : 2025-26 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: May 26, 2026, 06:58:03 IST
Advertisement

Telangana ePass Scholarship 2026 : తెలంగాణలోని బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తులకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఉపకారవేతనాలు, బోధన ఫీజుల (ఫీజు రీయింబర్స్‌మెంట్) కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సర్కార్ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు
విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, అలాగే దివ్యాంగులైన విద్యార్థులందరూ ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకోవచ్చు. సాంకేతిక ఇబ్బందుల వల్ల గతంలో దరఖాస్తులు పూర్తి చేయలేకపోయిన వారికి ఇది పెద్ద ఉపశమనం కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా బోధన ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు మొత్తం 10,89,265 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే…. వీరిలో ఇప్పటివరకు 10,20,688 మంది మాత్రమే అప్లికేషన్లను సమర్పించారు. ఇంకా 68,577 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు.

సాంకేతిక కారణాలు….

చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడానికి ప్రధానంగా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. వివిధ ప్రవేశ పరీక్షల (కౌన్సెలింగ్) డేటా అప్‌డేట్ కావడంలో ఆలస్యం జరగడం, బయోమెట్రిక్ లేదా గుర్తింపు వివరాలు సరిపోలకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు ఎదుర్కొన్నారు.

ఈ ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం…. ఏ ఒక్క అర్హుడైన విద్యార్థి కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో మే 31 వరకు తుది అవకాశం కల్పించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వెంటనే సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….

కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

రిఫరెన్స్ నెంబర్ తో స్కాలర్ షిప్ స్టేటస్ కూడా చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన డబ్బు వివరాలతో పాటు కాలేజీ ఖాతాలోకి వెళ్లిన వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe