అక్రమ సంబంధం కారణంగా జరిగే హత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువ అయ్యాయి. ఎప్పటి నుంచో ఉన్న బంధాలను మధ్యలో వచ్చిన వారి కోసం తెంచేసుకుంటున్నారు. జైళ్లకు వెళ్తున్న ఘటనలు చూస్తున్నా.. చాలా మంది ఇలాంటి పనులను మానుకోవడం లేదు. తాజాగా ఓ యువకుడితో అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపేసింది ఓ మహిళ. అంతేకాదు.. గుండెపోటు అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో కర్ణాటకకు చెందిన అశోక్ (45), పూర్ణిమ (36)లు నివాసం ఉంటున్నారు. వీరికి 2011లో పెళ్లి అయింది. 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అశోక్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. పూర్ణిమ బోడుప్పల్‌లో ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. గతంలో వేరే ప్రాంతంలో నివసించేవారు. దీనికి కారణం పూర్ణిమకు ఉన్న అక్రమ సంబంధం. గతంలో నివసించిన ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు చెందిన భవన నిర్మాణ కూలీ 22 ఏళ్ల మహేశ్‌తో పూర్ణిమకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త కొన్ని రోజులకు అక్రమ సంబంధంగా మారింది.
ఈ విషయం భర్త అశోక్‌కు తెలిసి భర్య పూర్ణిమను మందలించాడు. ఇక్కడ ఉంటే పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీకి వెళ్లి నివాసం ఉంటున్నారు. అయిన కూడా పూర్ణిమ తన తీరును మార్చుకోలేదు. అప్పుడప్పుడు ఈ విషయంపై గొడవలు కూడా జరిగేవి.
తమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని.., ప్రియుడు మహేశ్‌తో చెప్పింది. ఇద్దరు కలిసి అశోక్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్లాన్ వేశారు. మహేశ్ తన స్నేహితుడు భుక్యా సాయికుమార్ సాయం తీసుకున్నాడు. డిసెంబర్ 11వ తేదీన అశోక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో మహేశ్, సాయి కుమార్ ఉన్నారు. ఒక్కసారిగా మహేశ్ మీద దాడి చేశారు. నోరు మూసేశారు.
పూర్ణిమ, సాయికుమార్.. అశోక్‌ను కదలకుండా పట్టుకున్నారు. మహేశ్ చున్నీలను అశోక్ మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అశోక్ చనిపోయాక వెళ్లిపోయారు. ఇక పూర్ణిమ తన భర్త చావుపై డ్రామా మెుదలుపెట్టింది. తన భర్త ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఓపిక లేదని పడుకున్నాడని, గుండెపోటు వచ్చిందని అందరికీ చెప్పింది. బంధువులను కూడా నమ్మించింది.
{{/usCountry}}పూర్ణిమ, సాయికుమార్.. అశోక్‌ను కదలకుండా పట్టుకున్నారు. మహేశ్ చున్నీలను అశోక్ మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అశోక్ చనిపోయాక వెళ్లిపోయారు. ఇక పూర్ణిమ తన భర్త చావుపై డ్రామా మెుదలుపెట్టింది. తన భర్త ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఓపిక లేదని పడుకున్నాడని, గుండెపోటు వచ్చిందని అందరికీ చెప్పింది. బంధువులను కూడా నమ్మించింది.
{{/usCountry}}కానీ అప్పటికే అశోక్ శరీరం మీద కొన్ని గాయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులు గమనించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అశోక్ మృతి సమయంలో మహేశ్, సాయి కుమార్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా రికార్డు అయింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.