వివిధ పనుల నిర్వహణ కారణంగా ఆదివారం రోజున అంటే సెప్టెంబర్ 20వ తేదీన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మెుత్తం 4 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఇందులో సికింద్రాబాద్-వరంగల్ (67761/67762) మెమూ రైళ్లు ఉన్నాయి. వీటితోపాటుగా రద్దీగా ఉండే మరో రూట్‌లో కూడా రెండు ట్రైన్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757/12758) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టుగా సీపీఆర్‌ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు

పండుగల వేళ ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వేల పరిధిలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుండి తమిళనాడులోని తిరునెల్వేలి మధ్య (వరంగల్, విజయవాడ మీదుగా) ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ రైళ్ల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలగనుంది.
ప్రయాగ్‌రాజ్ - తిరునెల్వేలి స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య: 04171) ప్రతి శనివారం ఉంటుంది. సెప్టెంబర్ 19, 2026 నుండి అక్టోబర్ 10, 2026 వరకు మొత్తం 4 సర్వీసులు నడుపుతారు.
తిరునెల్వేలి - ప్రయాగ్‌రాజ్ స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య: 04172) ప్రతి సోమవారం సెప్టెంబర్ 21, 2026 నుండి అక్టోబర్ 12, 2026 వరకు 4 సర్వీసులు ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఏపీలో చూసుకుంటే.. సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఇతర రాష్ట్రాల్లో మానిక్‌పూర్, సత్నా, కాట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హార్షా, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టిలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ప్రయాణికులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైలు వేళలు, ప్లాట్‌ఫారమ్ వివరాల కోసం 139 రైల్వే ఎంక్వైరీ నంబర్‌ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ప్రయాణికులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైలు వేళలు, ప్లాట్‌ఫారమ్ వివరాల కోసం 139 రైల్వే ఎంక్వైరీ నంబర్‌ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}