SCR Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు! టైమింగ్స్, తేదీలివే
SCR Special Trains : పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు వీక్లీ స్పెషల్ రైళ్ల సర్వీసులను పొడిగించింది. చర్లపల్లి-షాలిమార్ సహా పలు మార్గాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
SCR Special Trains : పండుగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగే ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న పలు వారపు ప్రత్యేక (వీక్లీ స్పెషల్) రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఉపశమనం లభించనుంది.

పొడిగించిన రైళ్ల వివరాలు, తేదీలు:
- చర్లపల్లి - షాలిమార్ (08046 ): అక్టోబర్ 3, 2026 నుండి నవంబర్ 28, 2026 వరకు ప్రతి శనివారం (మొత్తం 09 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
- షాలిమార్ - చర్లపల్లి (08045) : అక్టోబర్ 2, 2026 నుండి నవంబర్ 27, 2026 వరకు ప్రతి శుక్రవారం (మొత్తం 09 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
- కోయంబత్తూర్ - జైపూర్ (06181) : అక్టోబర్ 8, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు ప్రతి గురువారం (మొత్తం 08 సర్వీసులు) సర్వీసులు అందిస్తుంది.
- జైపూర్ - కోయంబత్తూర్ (06182) : అక్టోబర్ 11, 2026 నుండి నవంబర్ 29, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 08 సర్వీసులు) నడుస్తుంది.
- జోధ్‌పూర్ - చెన్నై బీచ్ (04815) : అక్టోబర్ 3, 2026 నుండి నవంబర్ 28, 2026 వరకు ప్రతి శనివారం (మొత్తం 09 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
- చెన్నై సెంట్రల్ - జోధ్‌పూర్ (04816) : అక్టోబర్ 6, 2026 నుండి డిసెంబర్ 1, 2026 వరకు ప్రతి మంగళవారం (మొత్తం 09 సర్వీసులు) సర్వీసులు నడుస్తాయి.
- కాన్పూర్ సెంట్రల్ - SMVT బెంగళూరు (04131 ): అక్టోబర్ 4, 2026 నుండి నవంబర్ 15, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 07 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
- SMVT బెంగళూరు - కాన్పూర్ సెంట్రల్ (04132): అక్టోబర్ 7, 2026 నుండి నవంబర్ 18, 2026 వరకు ప్రతి బుధవారం (మొత్తం 07 సర్వీసులు) సర్వీసులు అందిస్తుంది.
హాల్టింగ్ లిస్ట్….
చర్లపల్లి - షాలిమార్ ఈ రైళ్లు ఇరువైపులా కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, ఖరగ్‌పూర్, సంత్రగాచి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
- కోయంబత్తూర్ - జైపూర్ సర్వీసులు (06181/06182) : తెలుగు రాష్ట్రాల్లోని రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గూటి, డోన్, కర్నూల్ సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్ స్టేషన్ల గుండా ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.
- జోధ్‌పూర్ - చెన్నై సర్వీసులు (04815/04816): సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట స్టేషన్లలో ఈ రైళ్లకు నిలిపే సదుపాయం కల్పించారు.
- కాన్పూర్ సెంట్రల్ - SMVT బెంగళూరు సర్వీసులు (04131/04132): సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్ల ద్వారా ఈ సర్వీసులు నడుస్తాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

