సికింద్రాబాద్‌-వరంగల్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌‌‌ మార్గంలో 4 రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఆదివారం రోజున రద్దీగా ఉండే కీలక మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్టుగా ప్రకటించింది. మరోవైపు ప్రయాగ్‌రాజ్ - తిరునెల్వేలి వయా ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లునడుస్తాయి.

Published on: Sep 19, 2026, 10:35:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివిధ పనుల నిర్వహణ కారణంగా ఆదివారం రోజున అంటే సెప్టెంబర్ 20వ తేదీన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మెుత్తం 4 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఇందులో సికింద్రాబాద్‌-వరంగల్‌ (67761/67762) మెమూ రైళ్లు ఉన్నాయి. వీటితోపాటుగా రద్దీగా ఉండే మరో రూట్‌లో కూడా రెండు ట్రైన్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757/12758) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టుగా సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు

పండుగల వేళ ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వేల పరిధిలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుండి తమిళనాడులోని తిరునెల్వేలి మధ్య (వరంగల్, విజయవాడ మీదుగా) ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ రైళ్ల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలగనుంది.

ప్రయాగ్‌రాజ్ - తిరునెల్వేలి స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య: 04171) ప్రతి శనివారం ఉంటుంది. సెప్టెంబర్ 19, 2026 నుండి అక్టోబర్ 10, 2026 వరకు మొత్తం 4 సర్వీసులు నడుపుతారు.

తిరునెల్వేలి - ప్రయాగ్‌రాజ్ స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య: 04172) ప్రతి సోమవారం సెప్టెంబర్ 21, 2026 నుండి అక్టోబర్ 12, 2026 వరకు 4 సర్వీసులు ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఏపీలో చూసుకుంటే.. సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఇతర రాష్ట్రాల్లో మానిక్‌పూర్, సత్నా, కాట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హార్షా, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టిలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైలు వేళలు, ప్లాట్‌ఫారమ్ వివరాల కోసం 139 రైల్వే ఎంక్వైరీ నంబర్‌ను సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More